Cyclone Montha | దడ పుట్టిస్తున్న ‘మొంథా’ తుఫాను – పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
                    Cyclone Montha News Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ‘మొంథా’ తుఫాన్‌గా (Cyclone Montha) మారింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉంది. గంటకు సుమారు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నట్లు పేర్కొంది.
కాగా మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. , సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. తుఫాను సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని IMD తెలిపింది.
ఈ తుఫాను (Cyclone Montha ) ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 5 సెం.మీ. నుండి 20 సెం.మీ....                
                
             
								
