Sarkar Live

Day: October 29, 2025

Warangal Rains | భారీ వర్షంతో  వరంగల్​ అతలాకుతలం
State, warangal

Warangal Rains | భారీ వర్షంతో వరంగల్​ అతలాకుతలం

జిల్లాలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం మానుకోట, డోర్నకల్​, వరంగల్​ రైల్వే స్టేష‌న్లలో నీటమునిగిన రైలు పట్టాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి పలు రైళ్లు.. మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు Warangal Rains | తుపాను మొంథా ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హన్మకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్‌ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, ఆ త‌ర్వాత‌ వరంగల్‌ జిల్లా కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63, సంగెంలో 23.48, వర్ధన్నపేటలో 22.8, సెంటీమీటర్ల వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 21.8, జనగామ జిల్లా గూడురులో 23.58, మహబూబాబాద్‌ జిల్లా ఇనగుర్తిలో 19.23, కరీంనగర్‌ జిల్లా బోర్నపల్లిలో 17.58, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 16.45, యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16.23 సెంటీమీటర్ల వర్...
Cyclone Montha | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. అధికారుల‌కు సీఎం రేవంత్‌ అత్యవసర ఆదేశాలు
State, Hyderabad

Cyclone Montha | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. అధికారుల‌కు సీఎం రేవంత్‌ అత్యవసర ఆదేశాలు

Hyderabad | మొంథా తూపాన్‌ (Cyclone Montha) తీవ్ర వాయుగుండంగా మారి దక్షిణ భారతదేశంలో కుంభ‌వృష్టి కురిపిస్తోంది. తెలంగాణలో కూడా తుఫాను ప్రభావం పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటిన మొంథా తుఫాన్‌ భద్రాద్రి కొత్తగూడం మార్గంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ‌వారం ఉద‌యం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ (Warangal) , నల్గొండ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి కలెక్టర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సమన్వయంతో నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని చెప్ఆప‌రు.సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, వర్షాల ప్రభావం, నష్టాలపై అత్య‌వ‌సరంగా చేప‌ట్టాల్సిన ప‌నుల‌పైసమీ...
Montha Cyclone | మొంథా తుఫాన్ ప్ర‌భావం.. తెలంగాణ‌లో దంచికొడుతున్న వ‌ర్షాలు..
State, Hyderabad

Montha Cyclone | మొంథా తుఫాన్ ప్ర‌భావం.. తెలంగాణ‌లో దంచికొడుతున్న వ‌ర్షాలు..

హైద‌రాబాద్‌, స‌ర్కార్‌లైవ్ : మొంథా తుపాను (Montha Cyclone) ప్ర‌భావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, పాల‌మూరు జిల్లా వ్యాప్తంగా వాన‌లు విజృంభిస్తున్నాయి. నిన్న‌టి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న కుండ‌పోత వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌ల్వ‌కుర్తి మండ‌లం ర‌ఘుప‌తిపేట వ‌ద్ద దుందుభి న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుంది. దీంతో క‌ల్వ‌కుర్తి – నాగ‌ర్‌క‌ర్నూల్ మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. చెట్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఈరోజు జ‌ర‌గాల్సిన ప‌రీక్షల‌ను వాయిదా వేశారు. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా జోరుగా వాన‌లు ప‌డుతున్నాయి. దీంతో జిల్లా అధికార యంత్ర...
error: Content is protected !!