Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు నిరవధికంగా బంద్ (Colleges Bandh ) చేస్తామని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు ప్రకటించారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం రాలేదని తెలిపారు. మొత్తం రూ.1,200 కోట్ల బకాయిల్లో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించిందని చెప్పారు. మిగిలిన రూ.900 కోట్లు దీపావళికి ముందు ఇవ్వాలని కోరామని కానీ, ఇప్పటివరకు చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు.కాగా నవంబర్ 2 లోపు ప్రభుత్వం చెల్లింపులపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే, నవంబర్ 3 నుంచి రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా...


