Accident | మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది దుర్మరణం
                    Jaipur road Accident  | జైపూర్‌లోని హర్మాడలో సోమవారం మధ్యాహ్నం ఒక డంపర్ ట్రక్కు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ముందున్న అనేక వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో సుమారు 19 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక మంది గాయపడ్డారు. ఖాళీ డంపర్ రోడ్ నంబర్ 14 నుండి లోహా మండి పెట్రోల్ పంప్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 300 మీటర్ల విస్తీర్ణంలో ఒకదాని తర్వాత ఒకటి వాహనాలను ఢీకొట్టడం ప్రారంభించింది. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై సాధారణ ట్రాఫిక్ ఉందని, కానీ అకస్మాత్తుగా ఒక డంపర్ మితిమీరిన వేగంతో వచ్చి కారును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వరుసగా మూడు కిలోమీటర్ల మేర ముందున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిందని.తెలిపారు.
ర...                
                
            
								

