Train Accident | ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలు ఢీ.. పలువురు మృతి
Bilaspur Train Accident | ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న రైలు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. రాయ్‌గఢ్ నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు లాల్‌ఖండ్ సమీపంలో నిలిచివున్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.
రెస్క్యూ బృందాల చర్యలు
ప్రమాద గురించి సమాచారం అందుకున్న వెంటనే SDRF, NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. బోగీలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గ్యాస్ కట్టర్ల సహాయంతో కోచులను కట్ చేస్తున్నారు. రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని బిలాస్‌పూర్ హాస్పిటల్‌కు తరలించారు.
ఈ రైలు ప్రమాదంలో మహిళా కో...


