చీమలకు భయపడి మహిళ ఆత్మహత్య – Sangareddy
Sangareddy | ఓ మహిళ మానసిక సమస్యలతో బాధపడుతూ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అత్యంత అరుదైన ఘటన అందరినీ కలచివేసింది. చీమల ఫోబియాతో (Myrmecophobia) ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy district) అమీన్‌పూర్ లో నివసిస్తున్న గృహిణి మనీషా, ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వదిలిన సూసైడ్ నోట్‌లో “నాకు చీమలంటే చాలా భయం.. ఆ భయం నన్ను చంపేస్తోంది. నా కూతురిని జాగ్రత్తగా చూసుకోండి” అని రాసి ఉంది. ఈ లేఖను చూసిన కుటుంబ సభ్యులు, పోలీసులు, ఇరుగుపొరుగువారు షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
చీమల పట్ల భయం అనేది ఓ చిన్న విషయం. అయితే దీనికేగా ఆమె ప్రాణం తీస్తుకుంటుందని ఎవరూ ఊహించలేదు. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాద సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు సంఘటనా స్థల...

