Property Tax | హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్
ఆస్తి పన్ను (Property Tax) వడ్డీపై 90 శాతం రాయితీ!
హైదరాబాద్, డిసెంబర్ 22: చాలా కాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న భాగ్యనగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ (GHMC) తీపి కబురు అందించాయి. బకాయిలపై పేరుకుపోయిన వడ్డీ భారాన్ని తగ్గించేందుకు 'వన్ టైమ్ సెటిల్మెంట్' పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పథకం ముఖ్యాంశాలు:90% వడ్డీ మాఫీ: పన్ను చెల్లింపుదారులు తమ అసలు పన్ను మొత్తంతో పాటు, దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని కార్పొరేషన్ పూర్తిగా రద్దు చేస్తుంది.
ఎవరికి వర్తిస్తుంది?: ఈ రాయితీ కేవలం ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా, ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ పరిధితో పాటు, ఇటీవల గ్రేటర్‌లో విలీనమైన 20 మున్సిపాలిటీలు,...

