నాలా కన్వర్షన్‌ల ముసుగులో మున్సిపల్ ఖజానాకు గండి.. –NALA Conversion Scam
"బదిలీతో తహశీల్దార్ తప్పించుకున్నట్లేనా?”
బరితెగించిన నిర్ణయాలు.. మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి బదిలీపై వెళ్లిన తహశీల్దార్
లేఅవుట్ అనుమతులు లేకుండానే హుజురాబాద్ లో వందలాది ప్లాట్లకు కన్వర్షన్
Huzurabad NALA Conversion Scam | హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ వెంచర్లకు అధికార ముద్ర పడిందా? వందలాది ప్లాట్లకు లేఅవుట్ అనుమతులు లేకుండానే నాన్-అగ్రికల్చర్ (ఎన్‌ఏ) కన్వర్షన్‌లు ఎలా జరిగాయి? ఈ ప్రశ్నలు ప్రస్తుతం హుజురాబాద్ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజుల క్రితం బదిలీపై వెళ్లిన తహశీల్దార్ పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లేఅవుట్ అనుమతులు లేకుండానే కన్వర్షన్‌లు?
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, మున్సిపల్ అనుమతులు పొందకుండా అభివృద్ధి చేసిన పలు అక్రమ లేఅవుట్లలో వందలాది ప్లాట్లు విక్రయించబడ్డాయి. వ్యవసాయ భూముల్లోని అవే ప్లాట్లకు గజాల వారిగా కన...
