Bala Kishore Reddy Political Journey | రాజకీయాల్లో మార్పు రావాలంటే కేవలం పదవులు ఉంటే సరిపోదు.. ప్రజలతో మమేకమయ్యే మనసుండాలని నిరూపిస్తున్నారు యువనేత బాల కిషోర్ రెడ్డి (Bala Kishore Reddy) . సామాజిక సేవను కేవలం బాధ్యతగా కాకుండా, ఒక రాజకీయ శక్తిగా మలుచుకుంటూ ఆయన సాగిస్తున్న ప్రస్థానం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
సేవే పునాదిగా.. ప్రజలే అజెండాగా!
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలోనే కనిపిస్తుంటారు. కానీ, బాల కిషోర్ రెడ్డి శైలి ఇందుకు భిన్నం. సామాజిక సేవను తన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదిగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు, మహిళల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు బాల కిషోర్ రెడ్డిని ఒక నాయకుడిగా ప్రజల్లో నిలబెడుతోంది.
కొమ్మాల జాతరలో ప్రభా బండ...