సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రమేనా?
32 ఏసీకేల బియ్యం పెండింగ్.. ‘ఉప్పరపల్లి’ మిల్లుపై జోరుగా ప్రచారం!
వరంగల్ జిల్లా ఉప్పరపల్లిలోని సాయిరాం బిన్నీ రైస్ మిల్లు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో (CMR) ఈ మిల్లు భారీగా వెనుకబడి ఉండటంతో పాటు, అక్కడ ఉండాల్సిన ధాన్యం నిల్వలు మాయమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
32 ఏసీకేలకు సరిపడా ధాన్యం భద్రమేనా!
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ మిల్లులో సుమారు 32 ఏసీకేల (ACKs) మేర బియ్యం నిల్వలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సకాలంలో ఎఫ్.సి.ఐ (FCI)కి,పౌరసరఫరాల శాఖ కు అప్పగించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అసలు సదరు మిల్లులో ధాన్యం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 3 కోట్ల ధాన్యంలో సగ...
