Sarkar Live

కలెక్టర్ మేడం.. ప్రభుత్వ రోడ్డును రక్షించండి!

వరంగల్ జిల్లా పైడిపల్లి రెవెన్యూ శివారులో భూదాహం పెచ్చుమీరుతోంది. సామాన్యులకు చెందాల్సిన ప్రభుత్వ ఆస్తులు, దారులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమవుతున్నాయి. ఎన్.ఎస్.ఆర్ (NSR) హాస్పిటల్ నుండి కొత్తపేట వెళ్లే మార్గంలో ఇటీవల ఏర్పాటైన ప్రైవేట్ వెంచర్ సర్వే నెంబర్704లోని ప్రభుత్వ

వరంగల్ జిల్లా పైడిపల్లి రెవెన్యూ శివారులో భూదాహం పెచ్చుమీరుతోంది. సామాన్యులకు చెందాల్సిన ప్రభుత్వ ఆస్తులు, దారులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమవుతున్నాయి. ఎన్.ఎస్.ఆర్ (NSR) హాస్పిటల్ నుండి కొత్తపేట వెళ్లే మార్గంలో ఇటీవల ఏర్పాటైన ప్రైవేట్ వెంచర్ సర్వే నెంబర్704లోని ప్రభుత్వ రోడ్డు ను అమాంతం మింగినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.కొందరు రియల్టర్లు ప్రభుత్వ రోడ్డును యథేచ్ఛగా కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చేస్తున్న వైనం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.

​అసలేం జరుగుతోంది?

​గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే, లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.

​ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ నుండి కొత్తపేట మార్గంలో ఏళ్ల తరబడి ప్రజలు, రైతుల రాకపోకల కోసం ఉన్న ప్రభుత్వ రోడ్డును రాత్రికి రాత్రే మాయం చేశారు.ప్రభుత్వ భూమిని, రోడ్డును కలిపేసి దర్జాగా ప్రైవేట్ వెంచర్ ఏర్పాటు చేసారు.రోడ్డు కబ్జాకు గురవడంతో చుట్టుపక్కల ప్రజలు, రైతులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

​జిడబ్ల్యూఎంసీ,రెవెన్యూ అధికారుల మౌనం.. రియల్టర్ల ధీమా!

పైడిపల్లి రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 704 లో ​ప్రభుత్వ రోడ్డు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రియల్టర్లు ఇంతలా రెచ్చిపోతున్నారని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిదని వారు ప్రశ్నిస్తున్నారు.

కలెక్టర్ ‘సత్య శారద’ గారు స్పందించాలి!

​ఈ భూదందాలపై జిల్లా కలెక్టర్ సత్య శారద వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి, కబ్జాకు గురైన రోడ్డును స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వ దారిని మింగేసిన సదరు వెంచర్ అనుమతులను రద్దు చేయాలని,ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిన రియల్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

​ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న యంత్రాంగం ఇకనైనా నిద్ర మేల్కొంటుందో.. లేక రియల్టర్లకే వత్తాసు పలుకుతుందో వేచి చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?