రెవెన్యూ ‘రాజ్యాంగం’.. శేఖర్ కబంధ హస్తం!
వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ‘బారాణా’ బ్రోకర్ హవా!
అక్కడ ప్రభుత్వ నిబంధనలు పనిచేయవు.. కలెక్టర్ల ఆదేశాలు చెల్లవు.. కేవలం ఆ ‘బలవంతుడి’ మాటే వేదం. అతనే ‘రెవెన్యూ బ్రోకర్’ (Revenue Broker ) శేఖర్. ఒక సాదాసీదా వ్యక్తిగా మొదలై, నేడు రెండు జిల్లాల రెవెన్యూ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్న వైనం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
దశాబ్ద కాలంగా ఏకఛత్రాధిపత్యం
గత పదేళ్లుగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కలెక్టరేట్ల నుంచి మండల ఆఫీసుల వరకు శేఖర్ పేరు వినబడని చోటు లేదు. హన్మకొండ, వరంగల్, నర్సంపేట, పరకాల.. ఇలా డివిజన్ ఏదైనా, పని కావాలంటే శేఖర్ కనుసన్నల్లోనే జరగాల్సిందే. సామాన్యుడికి దక్కని ఆర్డీవో, తహశీల్దార్ల దర్శనం ఈ బ్రోకర్ కు మాత్రం నిత్యకృత్యం.
అధికారులకు ‘పావలా’.. బ్రోకర్ కు ‘బారాణా’
అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, వివాదాస్పద భూముల సెటిల్మెంట్లు, మ్యుటేషన్లు.. ఇలా ఫైలు ఏదై...



