India-Pakistan Conflict Live : పాకిస్తాన్ నిరంతరం భారతదేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ నిరంతరం సరిహద్దు దాటి క్షిపణులను, డ్రోన్లను పంపింది. అయితే, భారత్ (Indian Army) పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడంలో నిమగ్నమై ఉంది. ఈ మొత్తం పరిణామాల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వివరణాత్మక సమాచారాన్ని మీడియా సమావేశంలో వెల్లడించింది. నిన్న రాత్రి పాకిస్తాన్ సైన్యం కార్యకలాపాలు పిరికితనంతో కూడుకున్నవని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ పాకిస్తాన్ నిన్న రాత్రి పౌరుల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి యత్నించిందని అన్నారు. పాకిస్తాన్ చర్యలకు భారత సైనిక విభాగాలు బలంగా స్పందించాయి.
India-Pakistan Conflict పాకిస్తాన్ దాడులకు భారతదేశం ప్రతీకారం తీర్చుకుందని ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి (Sofia Quereshi) తెలిపారు. మే 8-9 తేదీల మధ్య రాత్రి, భారత్ లోని సైనిక స్థావరాలపై దాడులు చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యం మొత్తం పశ్చిమ ఫ్రంట్ అంతటా భారత గగనతలాన్ని అనేకసార్లు ఉల్లంఘించిందని అన్నారు. పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసీ వెంబడి భారీ ఆయుధాలతో కాల్పులు జరిపింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖలోని 36 ప్రదేశాలలో చొరబాటు కోసం 300-400 డ్రోన్లను ఉపయోగించారు. ఈ డ్రోన్లలో చాలా వాటిని భారతదేశం కూల్చివేసింది.
పాకిస్తాన్ టర్కిష్ డ్రోన్లను ఉపయోగించింది : కల్నల్ సోఫియా ఖురేషీ
భారత వైమానిక రక్షణ వ్యవస్థను పరీక్షించడం, నిఘా సమాచారాన్ని సేకరించడం కోసం పాకిస్తాన్ ఇంత పెద్ద ఎత్తున వైమానిక చొరబాట్లు చేసిందని సోఫియా ఖురేషి అన్నారు. భారత భూభాగంలో పడిన పాక్ డ్రోన్ శిథిలాలపై ఫోరెన్సిక్ దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమిక నివేదికల ప్రకారం అవి టర్కీకి చెందిన అసిస్‌గార్డ్ సోంగర్ డ్రోన్‌లని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని తంగ్‌ధర్, ఉరి, పూంచ్, మెధోర్, రాజౌరి, అఖ్నూర్‌లలో పాకిస్తాన్ భారీ తుపాకులను ఉపయోగించి నియంత్రణ రేఖపై కాల్పులు జరిపిందని కల్నల్ సోఫియా ఖురేషి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటనలో భారత సైనికులు గాయపడ్డారు. భారత చర్యలో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం జరిగిందని కూడా ఆయన అన్నారు.
భటిండాలోని ఎయిర్ స్టేషన్ పై దాడికి యత్నం
విలేకరుల సమావేశంలో, వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (wing commander vyomika singh) మాట్లాడుతూ.. భటిండాలోని వైమానిక స్థావరంపై దాడికి యత్నించారని తెలియజేశారు. ఈ సమయంలో, పాకిస్తాన్ బాధ్యతారహిత ప్రవర్తన మళ్ళీ కనిపించింది. పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థలు కరాచీ, లాహోర్ మధ్య సర్వీసులు కొనసాగించాయి. క్షిపణి దాడి జరిగినప్పటికీ, పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయలేదని ఆయన అన్నారు. పాకిస్తాన్ తన గగనతలాన్ని రక్షణ కవచంగా ఉపయోగిస్తోంది. భారత వైమానిక దళం తన విషయంలో చాలా సంయమనం పాటించిందని, పౌర విమానాల భద్రతకు హామీ ఇచ్చిందని వ్యోమిక సింగ్ అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.