ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు…
TG News | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Local Body Elections) బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. బుధ, గురువారాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల పాటు పిటిషనర్లు తమ సమాధానాలను దాఖలు చేయాలని తెలిపింది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ చేపట్టనున్నట్టుగా తెలిపింది. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినట్లయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఈరోజు తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికలపై, జీవో నంబర్ 9పై స్టే విధించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    