Cyclone Montha News Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ‘మొంథా’ తుఫాన్‌గా (Cyclone Montha) మారింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉంది. గంటకు సుమారు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నట్లు పేర్కొంది.
కాగా మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. , సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. తుఫాను సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని IMD తెలిపింది.
ఈ తుఫాను (Cyclone Montha ) ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 5 సెం.మీ. నుండి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే సోమవారం నుంచే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, మానుకోట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ . ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, సిద్దిపేట, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    