November 5 Holiday in Telangana | అనేక రాష్ట్రాల్లో బుధవారం నవంబర్ 5, 2025న పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. నవంబర్ 5న గురునానక్ జయంతి, ప్రభుత్వ సెలవుదినం. దీని కోసం ప్రభుత్వం గెజిటెడ్ సెలవు ప్రకటించింది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవుపై అయోమయానికి గురవుతున్నారు.సెలవు ఉంటుందని కొందరు, లేదని మరికొందరు ప్రచారం చేస్తున్నారు.
కాగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న తెలంగాణలో అధికారిక సెలవు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ హాలిడే క్యాలెండర్ లో సెలవు దినంగా పేర్కొనబడి ఉంది. కార్తీక పౌర్ణమితో పాటు సిక్కుల మతగురువు గురునానక్ జయంతి కూడా నవంబర్ 5నే. ఇలా హిందువులు, సిక్కులకు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి రేపు (బుధవారం) పూర్తిస్థాయిలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
ఏపీలో ఉంటుందా?
ఆంధ్రప్రదేశ్‌లో కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు లేదు. కానీ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే మాత్రం ఇచ్చారు. కావాలనుకుంటే మాత్రమే నవంబర్ 5న ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చు. నవంబర్ 6, 7 (గురు, శుక్రవారం) రెండ్రోజులు మాత్రమే స్కూళ్లు నడిచేది. తర్వాత నవంబర్ 8, 9 (రెండో శనివారం, ఆదివారం) రెండ్రోజులు సెలవులు రానున్నాయి. దీంతో వరుస సెలవులతో విద్యార్థులు ఎంజాయ్ చేయవచ్చు.








