Sabdham review Telugu | వైవిధ్యమైన స్టోరీస్ తో ఆడియన్స్ ను అలరించే ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) తెలుగులో హీరో కంటే విలన్ గా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు తో విలన్ గా బయపెట్టగా, రామ్ చరణ్ రంగస్థలంలో అన్నగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ప్రజెంట్ చాలా మూవీస్ చేస్తున్న Akhanda-2 లో విలన్ గా మరోసారి అలరించనున్నాడు. తను హీరోగా నటిస్తున్న కొన్ని మూవీస్ సెట్స్ పై ఉండగా ఈ రోజు వైశాలి ఫేమ్ అరివలగన్ (Arivalagan) డైరెక్షన్ లో శబ్దం(Sabdham) మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో లక్ష్మీమీనన్, సిమ్రాన్, లైలా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. మరి ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం….
కథ విషయానికి వస్తె..
ఒక మెడికల్ కళాశాల లో అనుమానస్పద స్థితిలో కొందరు స్టూడెంట్స్ ఆత్మహత్య లు చేసుకుంటారు.ఈ కాలేజీలో దెయ్యాలు ఉండడం వల్లనే ఇదంత జరుగుతుందనే అనుమానం కొందరికి కలుగుతుంది. ఇది తప్పని అందరికీ తెలియజెప్పడానికి కాలేజ్ యాజమాన్యం ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్య లింగంని (ఆది పినిశెట్టి) పిలిపిస్తారు.అతడు వచ్చాక అసలు ఈ చావుల వెనుక ఏముందనేది తెలుసుకున్నాడ..? కాలేజీలో దెయ్యాలు ఉన్నాయా..?వాటి వల్లనే ఇలా జరిగిందా..? అక్కడ ఉన్న కొందరి పాత్ర ఏంటి..? డయాన, నాన్సీ ఎవరు..? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే..
Sabdham review : మూవీ ఎలా ఉందంటే…
హార్రర్ మూవీస్ ని ఆడియన్స్ బాగా ఇష్టపడుతారు.ఇప్పటి వరకు చాలా హార్రర్ మూవీస్ వచ్చాయి. వాటిలో మెయిన్ గా వెనుకాల ఒక స్టోరీ ఉంటుంది. తనకు జరిగిన అన్యాయానికి దెయ్యంగా మారి ఏదో ఒక రూపంలో పగ తీర్చుకుంటుంది. ఆల్మోస్ట్ ప్రతీ మూవీలో ఇదే ఉంటుంది. కాకపోతే స్టోరీ నడిపించే విధానం కొత్తగా ఉంటే మూవీ ని ఆడియన్స్ ఆదరిస్తారు. లేకపోతే రొటీన్ రొట్ట కథగా తేల్చిపడేస్తారు. అరివలగన్ ,అది పినిశెట్టి కాంబోలో దశాబ్దం క్రితం వచ్చిన వైశాలి మూవీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు.హార్రర్ మూవీస్ లో ఆ మూవీ చాలా మంది అడి యన్స్ కి చాలా ఇష్టంగా ఉంటుంది. వారి కాంబోలో వచ్చిన మరో హార్రర్ మూవీ శబ్దం ఆ రేంజ్ లో తీయలేకపోయినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో అదిరిపోయింది. టైటీల్ కి తగ్గట్టుగా సౌండ్ తో ఆడియన్స్ భయపడే విధంగానే ఉంది. సినిమా మొదలు ఇంటర్వెల్ వరకు బోర్ కొట్టకుండా ఉన్న మూవీ సెకండ్ ఆఫ్ లో మాత్రం అలా కంటిన్యూ చేయలేకపోయారు. ఇలాంటి మూవీస్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కీలకం. కానీ అంత ఆకట్టుకునే విధంగా లేదు. రొటీన్ కథలా అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ లో వచ్చే ట్విస్ట్ లను రివీల్ చేస్తుంటే అంత ఆసక్తిగా అనిపించదు.ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉన్న మూవీ సెకండ్ ఆఫ్ తేలిపోయిందని చెప్పొచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…
ఆది పినిశెట్టి ఘోస్ట్ ఇన్వెస్టిగెటర్ వైద్య లింగం క్యారెక్టర్ లో అదరగొట్టారు. తన నుండి మూవీ వస్తుందంటే ఆడియన్స్ తన నుండి ఏం ఆశిస్తారో తెలుసు. వారి నమ్మకాన్ని తన నటనతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. లక్ష్మీమీనన్, సిమ్రాన్, లైలా మిగతా నటీనటులు వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. వైశాలితో అరివలగన్ సూపర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తన నుండి మూవీ వస్తుందంటే ఆడియన్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారో అలానే మూవీ తీసి సూపర్ అనిపించుకున్నాడు. సెకండ్ ఆఫ్ కొంచెం పట్టు వదలకుండా తీస్తే ఇంకా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేది. స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. అసలైంది మూవీ టైటిల్ (Sabdham movie) కి తగ్గట్టుగా సౌండ్ ఇంపార్టెంట్. ఇందులో అదే మెయిన్ రోల్. దానికి తగ్గట్టుగానే తమన్ తన మ్యూజిక్ తో ఇరగదీశారు. కొన్ని సీన్లలో తన సౌండ్ తో ఆడియన్స్ ని భయపెట్టారు. అరుణ్ పద్మనాభన్ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా మూవీ హార్రర్ మూవీస్ ఇష్టమున్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







