Road Accident : యువ హీరో, సినిమాటోగ్రాఫర్ దుర్మరణం!
Actor Bharat Kanth Death | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వర్ధమాన నటుడు భరత్ కాంత్ (31), యువ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ (31) హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
అసలేం జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, భరత్ కాంత్ మరియు త్రిలోక్ తమ సొంత ఊరైన నెల్లూరు నుంచి శనివారం రాత్రి కారులో బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో పెద్ద అంబర్‌పేట్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా, బొంగుళూరు ఎగ్జిట్ 12 సమీపంలో వీరి కారు అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ఒక కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. తీవ్ర గాయాల కారణంగా వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై ...




