Sarkar Live

Aamir khan | అమీర్- హిరానీ కాంబో రిపీట్..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir khan)సూపర్ హిట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Raj Kumar hiraani) కాంబోలో వచ్చిన మూవీస్ ఎంత పెద్ద హిట్టు అయ్యాయో మనకు తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ త్రీ ఇడియట్స్

Aamir khan

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir khan)సూపర్ హిట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Raj Kumar hiraani) కాంబోలో వచ్చిన మూవీస్ ఎంత పెద్ద హిట్టు అయ్యాయో మనకు తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ త్రీ ఇడియట్స్ (three idiots) బాలీవుడ్లో సరికొత్త రికార్డులను తిరగ రాసింది. ఈ మూవీలో అమీర్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.మంచి ఎంటర్టైన ర్ తో పాటు మెసేజ్ ఉన్న మూవీ కావడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయింది.

ఆ తర్వాత వచ్చిన పీకే (pk) మూవీ కూడా ఇండస్ట్రీ హిట్టుగా రికార్డులు కొల్లగొట్టింది. భారీ వసూళ్ళు సాధించి అమీర్ కెరీర్ లోనే సూపర్ హిట్ మూవీ గా నిలిచిపోయింది. ఈ మూవీలో అమీర్ యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే అమీర్ కంటతడి పెట్టించాడు. అంతలా ఆడియన్స్ ని మిస్మరైజ్ చేసిన ఈ మూవీ కలెక్షన్ల సునామిని సృష్టించింది. ఇక ఈ మూవీ తర్వాత అమీర్ ఖాన్ రాజకుమార్ హీరానీ కాంబోలో మరో సినిమా తెరకెక్కలేదు.

రాజ్ కుమార్ హిరానీ మూవీస్ అంటేనే కామెడీ ఎంటర్టైనర్ తో పాటు మంచి మెసేజ్ ఉండే విధంగా తీర్చిదిద్దుతాడు. ఆడియన్స్ పల్స్ తెలిసిన ఈ డైరెక్టర్ లాస్ట్ మూవీ షారుక్ ఖాన్ (shah ruk Khan) హీరోగా డంకీ మూవీని తీశాడు. ఈ మూవీ ఆడియన్స్ పెట్టుకున్న భారీ ఎక్స్పెక్టేషన్ ను రీచ్ కాలేకపోయింది. ఎందుకంటే రాజ్ కుమార్ హిరానీ మూవీ తీస్తున్నాడు అంటేనే ఏ మూడు,నాలుగు ఏళ్లకు రిలీజ్ అవుతుంది. కానీ అప్పటివరకు ఉన్న కలెక్షన్లను దాటి కొత్త రికార్డులను సృష్టించే విధంగా ఉంటుంది.

Aamir khan కాంబో కన్ఫర్మ్..?

అమీర్ హిరానీ కాంబో డంకీ మూవీని కూడా ఆడియన్స్ అలాగే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజకుమార్ హిరానీ రేంజ్ లో ఈ మూవీ లేకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. హిట్ మూవీగా నిలిచిన కూడా ఆ మూవీపై ఈ డైరెక్టర్ ఫ్యాన్స్ సంతృప్తిగా లేరు. లేటెస్ట్ గా అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో మరో మూవీ రాబోతున్నట్టు ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. దీనిపై డైరెక్టర్ కూడా కన్ఫామ్ చేశారు. వారి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.

మున్నాభాయ్ మూడో పార్ట్ కి ముందే..?

రెండు మూడు కథలను అమీర్ (Aamir khan) కు వినిపించినట్లు, అందులో ఏ స్టోరీ అయిన కూడా అమీర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్లుగా నిలవడంతో పాటు డైరెక్టర్ రాజకుమారి హిరానీ పై అమీర్ కు ఎంతో నమ్మకం కాబట్టి ఎప్పుడైనా ఆయన డైరెక్షన్లో చేయడానికి వెనకాడడు. ఆ మధ్య రాజ్ కుమార్ హిరానీ తన సూపర్ హిట్ మూవీ మున్నాభాయ్ mbbs ,లగే రహో మున్నాభాయ్ మూవీల కొనసాగింపుగా మూడవ పార్ట్ కూడా రాబోతున్నట్లు వెల్లడించారు. కథ కూడా సగం పూర్తయిందని ఇంకా సగం స్టోరీ ఫినిష్ చేయాల్సి ఉందని చెప్పారు. ఆ మూవీ రాకముందే అమీర్ ఖాన్ తో మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ టాక్. దీనిపై తొందర్లోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ చేతులు కలపనుండటంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!