Sarkar Live

ACB అధికారులకు తెలియాల్సిందే…

ACB | హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో ఆ అధికారులు తీసుకుంటున్న లంచాలను చూస్తే “ACB” అధికారులు సైతం ఆశ్చర్యపోతారని, లంచాల వివరాలు చూస్తే వారు షాక్ కు గురికాక తప్పదని వాహనదారులు అంటున్నారు. గత రెండు రోజులుగా “సర్కార్” వెబ్ సైట్

ACB
  • హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో లంచాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే…
  • హోదాను బట్టి లంచాలు… ప్రైవేట్ అసిస్టెంట్ లతో వసూళ్లు..
  • కార్యాలయంలో తీసుకుంటున్న లంచాలు చూస్తే ACB అధికారులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే..

ACB | హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో ఆ అధికారులు తీసుకుంటున్న లంచాలను చూస్తే “ACB” అధికారులు సైతం ఆశ్చర్యపోతారని, లంచాల వివరాలు చూస్తే వారు షాక్ కు గురికాక తప్పదని వాహనదారులు అంటున్నారు. గత రెండు రోజులుగా “సర్కార్” వెబ్ సైట్ ప్రచురిస్తున్న వరుస కథనాలను గమనిస్తున్న వాహనదారులు.. హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఎవరికి వారే అవును ఇది నిజం నాకూ ఇలాగే జరిగింది.. నేను కూడా ఫలానా పనికి (సేవకు) కార్యాలయం వెలుపల ఉన్న అధికారుల ప్రైవేట్ అసిస్టెంట్ వద్ద లంచం ఇచ్చి పత్రాలపై కోడ్(చుక్క) ను వేపించుకుంటేనే పని అయింది అని చర్చించుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ఎలాగైనా “అవినీతి నిరోధక శాఖ “అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే “సర్కార్” వెబ్ సైట్ లంచాల వివరాలను ప్రచురిస్తోంది. ఏ పనికి(సేవకు) ఎంత లంచం వసూలు చేస్తారు? అందులో నుంచి డీడీసీ/డీటీవో, ఎంవీఐ(మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్), ఏవో(సూపరింటెండెంట్), క్లర్క్ (జూనియర్ అసిస్టెంట్/సీనియర్ అసిస్టెంట్) లకు ఎంత ముడుతోంది.. వివరాలు కింది పట్టికలు చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

ACB అధికారులు గమనించాలి..

ఆర్టీఏ కార్యాలయంలో ఎవరు కూడా డైరెక్ట్ గా లంచాలు తీసుకోరు. కేవలం వారి ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారానే వసూళ్లకు పాల్పడతారు అది కూడా కోడ్ (చుక్కల) రూపంలోనే …

లైసెన్స్ కేటగిరీ

సర్వీస్ప్రభుత్వ ఫీజులంచం
లెర్నింగ్ లైసెన్స్ కురూ.450ఎంవీఐకి రూ. 900
క్లర్క్ కు రూ.100
పర్మినెంట్ లైసెన్స్రూ.1335ఎంవీఐ రూ.1500
హెవీ లైసెన్స్రూ.1600ఎంవీఐకి రూ.3300
ట్రాన్స్ పోర్ట్ లైసెన్స్రూ.1335ఎంవీఐకి రూ.2100

కొత్త వాహన రిజిస్ట్రేషన్లు

సర్వీస్ప్రభుత్వ ఫీజులంచం
టూ వీలర్లేదుఎంవీఐకి రూ.250
ఏవోకు రూ.100
క్లర్క్ కు రూ.100
కార్లులేదుఎంవీఐకి రూ.600
ఏవోకు రూ.200
క్లర్క్ కు రూ.200
త్రీవీలర్ & ఆటో రిక్షా ప్యాసింజర్లేదుడీటీవోకు రూ.2000
ఎంవీఐకి రూ.600
ఏవోకు రూ.200
క్లర్క్ కు రూ.200
ఎల్ఎంవీ గూడ్స్లేదుడీటీవోకు రూ.200
ఎంవీఐకి రూ.1200
ఏవోకు రూ.200
క్లర్క్ కు రూ.200
ట్రాక్టర్ ట్రాలీలేదుడీటీవోకు రూ.800
ఎంవీఐకి రూ.1500
ఏవోకు రూ.300
క్లర్క్ కు రూ.300
మోటార్ క్యాబ్లేదుడీటీవోకు రూ.2200
ఎంవీఐకి రూ.1400
ఏవోకు రూ.500
క్లర్క్ కు రూ.500
మీడియం గూడ్స్ వెహికిల్లేదుడీటీవోకు రూ.2200
ఎంవీఐకి రూ.2200
ఏవోకు రూ.500
క్లర్క్ కు రూ.500
హెవీ గూడ్స్ వెహికిల్లేదుడీటీవోకు రూ.3200
ఎంవీఐకి రూ.5500
ఏవోకు రూ.1000
క్లర్క్ కు రూ.1000
జెసిబిలేదుడీటీవోకు రూ.2200
ఎంవీఐకి రూ.2400
ఏవోకు రూ.500
క్లర్క్ కు రూ.500
హార్వెస్టర్లేదుడీటీవోకు రూ.5500
ఎంవీఐకి రూ.2400
ఏవోకు రూ.1000
క్లర్క్ కు రూ.1000

ఫిట్ నెస్

సర్వీస్ప్రభుత్వ ఫీజులంచం
ఆటో రిక్షారూ.600
ఎంవీఐకి రూ.400
క్లర్క్ కు రూ.100
ఎల్ఎంవీ గూడ్స్రూ.800ఎంవీఐకి రూ.1000
క్లర్క్ కు రూ.100
ట్రాక్టర్, ట్రాలీరూ.800ఎంవీఐకి రూ.1400
క్లర్క్ కు రూ.100
మోటార్ క్యాబ్రూ.800ఎంవీఐకి రూ.900
క్లర్క్ కు రూ.100
మీడియం గూడ్స్ వెహికిల్రూ.1000ఎంవీఐకి రూ.1800
క్లర్క్ కు రూ.100
హెవీ గూడ్స్ వెహికిల్రూ.1000ఎంవీఐకి రూ.2200
క్లర్క్ కు రూ.100

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?