Sarkar Live

Adivi sesh | డిఫరెంట్ గా డెకాయిట్ గ్లింప్స్..

Adivi sesh Decoit Movie | క్షణం, ఎవరు, గూడచారి, మేజర్ మూవీలతో ఎప్పటికప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్లతో అదరగొడుతున్న అడివి శేష్ (Adavi sesh) ఈసారి డెకాయిట్(Decoit)మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. హిట్ 2 మూవీ తర్వాత రెండు సినిమాలకు సైన్

Adivi sesh Decoit Movie

Adivi sesh Decoit Movie | క్షణం, ఎవరు, గూడచారి, మేజర్ మూవీలతో ఎప్పటికప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్లతో అదరగొడుతున్న అడివి శేష్ (Adavi sesh) ఈసారి డెకాయిట్(Decoit)మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. హిట్ 2 మూవీ తర్వాత రెండు సినిమాలకు సైన్ చేసి ముందుగా డెకాయిట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాడు.

క్షణం, గూడచారి (kshanam,gudachari)సినిమాలకు కెమెరామెన్ గా వర్క్ చేసిన షానియల్ డియో(shanial deo) డైరెక్టర్గా తనతో పాటు అడవి శేషు కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే రాసి ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్ ను పంచబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక ప్రేమకథ ట్యాగ్ లైన్ తో వస్తున్న డెకాయిట్ లో మృణాల్ ఠాకూర్ (Mrunal thakur) డిఫరెంట్ క్యారెక్టర్ లో కనబడబోతుంది.

Adivi sesh : అంచనాలు పెంచిన డైలాగ్…

గ్లింప్స్ స్టార్టింగ్ లోనే అడవి శేషు చెప్పిన డైలాగ్ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేసేది. భారీ స్టార్ క్యాస్టింగ్ తో వస్తున్న ఈ మూవీతో అడవి శేషు కెరీర్ లో మరో హిట్ మూవీగా నిలిచిపోతుందన డంలో సందేహం లేదనిపిస్తోంది. తన క్యారెక్టర్ తోనే మూవీపై భారీ హైప్స్ క్రియేట్ చేసారు. తన యాక్టింగ్, రైటింగ్ లో వచ్చిన మూవీస్ ఏది కూడా ఆడియన్స్ ను నిరాశపరచలేదు. ఈ మూవీ కూడా కచ్చితంగా హిట్టు కొడుతుందన్న హోప్ తో మూవీ టీం ఉంది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని మరింతగా పెంచేలా గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

భీమ్స్ సిసిరిలియో మ్యూజిక్..

ఈ మూవీకి ప్రజెంట్ మంచి ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో (bheems ceciroleo) మ్యూజిక్ తో అదరగొట్టేసాడు. ఇప్పటివరకు తను చేసిన మూవీస్ అన్నిట్లో కూడా ఈ మూవీ డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు అనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ ఎస్ క్రియేషన్స్ సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ పై సుప్రియ యార్లగడ్డ ఈ మూవీని నిర్మిస్తుండగా,మాటలు అబ్బూరి రవి రాస్తున్నారు. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల నటిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?