Akhanda 2 Ticket Price | హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ క్రమంలో, బాలకృష్ణ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో చాటి చెప్పే అసాధారణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
జర్మనీ అభిమాని రికార్డ్
సాధారణంగా ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం ఆసక్తి చూపిస్తారు. అయితే, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన ఎన్ఆర్ఐ (NRI) అభిమాని రాజశేఖర పర్నపల్లి ఏకంగా ఒకే టికెట్‌ను రెండు లక్షల రూపాయలు (రూ. 2,00,000) చెల్లించి కొనుగోలు చేశారు.
బాలయ్యపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాణ బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. రూ. 2 లక్షలకు అఖండ 2 టికెట్ అమ్ముడవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో సినిమా విడుదల ముందు నుంచే రికార్డులను సృష్టిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







