Sarkar Live

మత సామరస్యానికి వరంగల్ ప్రతీక: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాజీపేటలోని ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో చర్చి నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ నగరం మత సామరస్యానికి,

కాజీపేటలోని ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో చర్చి నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ నగరం మత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దమని కొనియాడారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులంతా కలిసిమెలసి ఉండటమే ఈ ప్రాంత ప్రత్యేకతని, ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజంలో సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు. భక్తులందరికీ ఫాతిమా మాత ఆశీస్సులు లభించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ అబూబకర్, సీనియర్ నాయకులు ఎస్.టి. పాల్ ఆనంద్, విశ్రాంత బిషప్ జోసెఫ్, ఫాదర్ విజయపాల్, చర్చి గురువులు మర్రెడ్డి, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?