Sarkar Live

Allu Arjun Movie | అల్లు, అట్లీ ప్రాజెక్ట్ ఫిక్స్…

పుష్ప 2 మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (icon star Allu Arjun)ఏ సినిమా చేస్తాడో అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాపై సూపర్ అప్డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్, అట్లీ (Trivikram, Atlee)కథలకు

Allu Arjun

పుష్ప 2 మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (icon star Allu Arjun)ఏ సినిమా చేస్తాడో అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాపై సూపర్ అప్డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్, అట్లీ (Trivikram, Atlee)కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్ ముందుగా ఎవరు డైరెక్షన్లో మూవీ మొదలు పెడతాడో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ముందుగా త్రివిక్రమ్ మూవీనే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని ఓ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పుకొచ్చారు.

ఆ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అట్లీతో మూవీని కంప్లీట్ చేస్తాడని ఫాన్స్ ఊహించారు. అనుకున్న విధంగానే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ని మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ 22వ మూవీ(icon 22nd film)గా తెరకెక్కుతున్న ఈ మూవీని అట్లీ డైరెక్ట్ చేయబోతున్నట్లు, సన్ పిక్చర్స్(sun pictures)వారు ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది.

అట్లీ కెరీర్లో తీసింది ఐదు సినిమాలే అయినా వరల్డ్ వైడ్ గా తన మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఆయన నుండి సినిమా వస్తుందంటే చాలు ఇది పక్కా బ్లాక్ బస్టర్ అనే అంతగా ఎదిగిపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో ప్లాన్ చేసిన మూవీ అయితే అంతకుమించి అనేలా ఉంటుందని రిలీజ్ చేసిన వీడియోని చూస్తే అర్థమవుతుంది.

అవతార్, స్పైడర్ మాన్ లాంటి మూవీస్ కి పనిచేస్తున్న వీ ఎఫ్ ఎక్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడడం చూస్తే హాలీవుడ్ రేంజ్ మూవీని తీయబోతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఒక డిఫరెంట్ మూవీ ని అట్లీ తీయబోతున్నాడు. అట్లీ కి కూడా ఈ టైప్ స్టొరీ అనేది కొత్తదే.

ఊహకందని ప్రపంచం…

ఇప్పటి వరకు తను తీసినవి అన్నీ కూడా లవ్ స్టోరీ, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీసే.కానీ ఐకాన్ స్టార్ తో తీయబోయే మూవీతో అట్లీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇది ఒక ఊహకందనే ప్రపంచం అని అల్లు అర్జున్ తన ఎక్స్ లో రాసుకొచ్చారంటే ఇది ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ మూవీతో అల్లు అర్జున్ నటుడిగా మరో మెట్టు ఎక్కించే మూవీగా నిలబడుతుందని అనిపిస్తుంది.

Allu Arjun : అట్లీ తో మూవీ అంతకుమించి..

అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ లోనే కాదు ఇండియన్ సినీ చరిత్రలో పుష్ప2 అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక నెక్స్ట్ అట్లీతో తీయబోయే ఈ మూవీ అంతకుమించి ఉంటుందనడంలో సందేహం లేదని వీడియో చూపించి మేకర్స్ చెప్పకనే చెప్పారు ఏదేమైనా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , అట్లీ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఎన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తుందో చూడాలి…


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!