Sarkar Live

Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి

Alluri Sitarama Raju Road Accident | అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో

Road Accident

Alluri Sitarama Raju Road Accident | అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

రాజుగారిమెట్టు వద్ద ప్రమాదం

ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారిమెట్టు మలుపు వద్దకు రాగానే, బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 37 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులుగా గుర్తించారు. బస్సు కూడా చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్టు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలం వద్ద ప్రయాణికుల హాహాకారాలతో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి.

క్షతగాత్రులకు చికిత్స

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో బోల్తా పడిన బస్సు నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల సంఖ్యపై మరింత స్పష్టత తెలియాల్సి ఉంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?