Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి యజమానితో భర్త ఒప్పందం!
Crime

ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి యజమానితో భర్త ఒప్పందం!

Morbi Gujarat Crime Landlord Rape | కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడిగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల నెపంతో ఇంటి అద్దె బకాయిలు మాఫీ చేయించుకునేందుకు, తన భార్య మరియు మైనర్ కుమార్తెను ఇంటి యజమాని కామవాంఛకు బలిపెట్టాడు. గుజరాత్‌లోని మోర్బిలో వెలుగుచూసిన ఈ అత్యంత హేయమైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వలస వచ్చిన కుటుంబంలో దారుణం పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం ఆరు నెలల కిందట మోర్బి నగరానికి వలస వచ్చింది. అక్కడ నెలకు రూ. 2,000 కిరాయికి ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ వ్యక్తి గత నాలుగు నెలలుగా ఇంటి కిరాయి చెల్లించలేకపోయాడు. దీంతో అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అద్దె బకాయిల కోసం అమానుష ఒప్పందం ఈ నేపథ్యంలో, పెరిగిపోయిన అద్దె బకాయిలను మాఫీ చేయడం కోసం ఆ వ్యక్తి ఇంటి యజమానితో ఒక అమానుష...
డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం..  ఇకపై పీడీ యాక్ట్ అమలు!
State, Hyderabad

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. ఇకపై పీడీ యాక్ట్ అమలు!

Drugs Control Telangana | రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన గురువారం తొలిసారిగా 'ఈగల్ ఫోర్స్' , పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ కేసుల్లో పదేపదే పట్టుబడే నిందితులపై పీడీ యాక్ట్ తరహా కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. కేవలం అరెస్టులతోనే సరిపెట్టకుండా, డ్రగ్స్ సరఫరాదారుల ఆస్తులను కూడా సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ముఖ్యంగా విద్యాసంస్థల విషయంలో డీజీపీ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై పాఠశాలలు, కాలేజీలు లేదా యూనివర్సిటీ ప్రాంగణాల్లో డ్రగ్స్ దొరికితే, దానికి పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. డ్రగ్స్ సరఫరాతో పాటు డిమాండ్ ఉన్న ప్రాంతాలపై కూడా తాము ప...
Road Accident మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు సహా ముగ్గురు బలి!
Crime

Road Accident మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు సహా ముగ్గురు బలి!

ఒక తాగుబోతు డ్రైవర్ సృష్టించిన బీభత్సం (Road Accident) మూడు కుటుంబాల్లో కడుపుకోత మిగిల్చింది. సాగర్ రోడ్డులోని హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. భవిష్యత్తుపై ఎంతో ఆశలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వంద మీటర్ల మేర ఈడ్చుకెళ్లి.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వస్తున్నాడు. హస్తినాపురం వద్దకు రాగానే నియంత్రణ కోల్పోయిన కారు మొదట ఒక ద్విచక్ర వాహనాన్ని, ఆపై రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మరో యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బాధితులు కారు కింద చిక్కుకోగా, వారిని సుమారు 100 మీటర్ల మేర అలాగే ఈడ్చుకెళ్లింది. చివరకు కారు పల్టీ కొట్టడంతో వాహనం ఆగిపోయింది. Road Accident : మృతుల వి...
రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal
State, Hyderabad

రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal

Highlightsఒకే గొడుగు కిందకు మూడు విభాగాలుBhu Bharati Portal ప్రాజెక్ట్ అమలు కానున్న 5 మండలాలు ఇవే:భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) ప్రత్యేకతలు:సర్వే ప్రక్రియ సాగుతుందిలా.. ఒకే గొడుగు కిందకు మూడు విభాగాలు Bhu Bharati Portal Pilot Launch | తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రూపొందించిన 'భూభారతి' (Bhu Bharati) పోర్టల్‌ను రేపటి నుంచి (ఏప్రిల్ 2) ప్రయోగాత్మకంగా ఐదు మండలాల్లో ప్రారంభించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను సమన్వయం చ...
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:
State, Hyderabad

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:

14 మంది మావోయిస్టుల మృతి.. కీలక నేత హతం! రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి తూటాల గర్జన వినిపించింది. శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు (Maoist Encounter) మరణించారు. వీరిలో ఒక కీలక నేత కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. సుక్మా జిల్లాలో 12 మంది మృతి సుక్మా జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున పామ్లూరు గ్రామం సమీపంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ముఖ్య నేత హతం: ఈ ఎన్‌కౌంటర్‌లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి 'మంగడు' మరణించారు. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మృతులు: మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్...
error: Content is protected !!