Amazon Web Services in Telangana : తెలంగాణలో డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ ప్రణాళికలు రూపొందించింది. రూ.60,000 కోట్ల పెట్టుబడితో ముందుకొస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.
భారీ బడ్జెట్‌తో వస్తున్నాం: AWS వైస్ ప్రెసిడెంట్ మైఖేల్
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక దినోత్సవంలో ఏడబ్ల్యూఎస్ (Amazon Web Services) వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పంకె (Michael Punke), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister A Revanth Reddy), ఐటీ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister D Sridhar Babu)తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, సాంకేతిక రంగంలో అభివృద్ధికి ప్రణాళికలపై చర్చించి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అనంతరం ప్రపంచ ఆర్థిక దినోత్సవం వేదికగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పంకె కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో భారీ బడ్జెట్‌తో డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించేందుకు సిద్ధమయ్యామని ప్రకటించారు.
సాంకేతిక రంగంలో AWS విశేష సేవలు
అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ (AWS) గతంలో ఓ కీలక ప్రకటన చేసింది. 2030 నాటికి మొత్తం రూ. 32,000 కోట్ల పెట్టుబడులతో మూడు డేటా సెంటర్లను అభివృద్ధి చేస్తామని చెప్పింది. ఇవి ఇప్పటికే కార్యరూపంలో ఉన్నాయి. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో డేటా సెంటర్లను విస్తరించి, క్లౌడ్ సేవలకు మరింత బలం చేకూర్చనుంది. ఇందులో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ కొత్త డేటా సెంటర్లను నిర్మించనుంది. తద్వారా ఆధునిక క్లౌడ్ టెక్నాలజీ పరిచయం చేస్తూ సాంకేతిక రంగంలో విశేష సేవలు అందించనుంది.
Amazon Web Services తెలంగాణలో పెట్టుబడుల ప్రాముఖ్యత
- AWS పెట్టుబడులు తెలంగాణకు ఆర్థిక, సాంకేతిక, సామాజిక లాభాలను అందించనున్నాయి.
- AWS డేటా సెంటర్లు AI, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయనున్నాయి.
- కొత్త డేటా సెంటర్ల నిర్మాణం ద్వారా నేరుగా ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది.
- IT ప్రొఫెషనల్స్, డేటా అనలిస్టులు, క్లౌడ్ ఇంజినీర్లు వంటి ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది.
- AI, డేటా అనాలిటిక్స్ వంటి హైటెక్ టూల్స్ అందుబాటులోకి వస్తాయి.
- విద్య, ఆరోగ్యం, మానవ వనరుల వంటి రంగాల్లో AI ఉపయోగాన్ని విస్తరించేందుకు AWS ప్రణాళిక రూపొందిస్తోంది.
- వేలాది మంది యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.
- స్టార్టప్‌లు, కొత్త కంపెనీల ద్వారా ఐటీ కేంద్రంగా హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది.
- డిజిటల్ సర్వీసుల పెరుగుదల వల్ల విద్య, ఆరోగ్య రంగాలు మరింత ప్రభావవంతం అవుతాయి.
AWSకు తెలంగాణ ప్రభుత్వ సహకారం
Amazon Web Services డేటా సెంటర్ల కోసం అదనపు భూమి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుదొచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ అంతర్జాతీయ స్థాయి ఐటీ హబ్‌గా ఎదగనుంది. AWS పెట్టుబడులు ఇతర అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..