మళ్లీ మేకప్ వేసుకున్న వడ్డే నవీన్ – Vadde Naveen comeback
Transfer Thrimurthulu Movie | ఒకప్పుడు వరుస హిట్టు సినిమాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన హీరో వడ్డే నవీన్ (Vadde Naveen)మళ్లీ యాక్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ లో సెలెబ్రెటీల ఇంటర్వ్యూల కింద కామెంట్స్ చూస్తే తన ఫాలోయింగ్ అప్పట్లో ఏ రేంజ్ లో ఉండేది అర్థం అవుతుంది. నవీన్ మళ్లీ ఎప్పుడూ యాక్ట్ చేస్తారో అని వెయిట్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వారందరూ కోరుకున్నట్టుగానే నవీన్ సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ హీరోగా అలరించబోతున్నాడు.
దాదాపు 15 ఏళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ వెటరన్ స్టార్ మళ్ళీ మేకప్ వేసుకున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈ హీరో. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి మూవీ అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆ మూవీ తర్వాత నవీన్ కి యూత్ లో పాపులారిటీ పెరిగింది.
ఆ తర్వాత కోరుకున్న ప్రియుడు,బాగున్నారా,చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒ ట్టు మీ ఆవిడ చాలా మంచిది,మా బ...




