ఇంటిని చూసుకోమంటే ‘ఊడ్చేశారు’.. హైదరాబాద్‌లో Nepali Gang హల్‌చల్
Hyderabad Nepali Gang Theft | హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో ఓ నేపాలి గ్యాంగ్ హల్‌చల్ చేసింది. వ్యాపారి (Businessman) ఇంట్లోంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు అపహరించి ఉడాయించింది. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి పనులు చూసుకోవడంతోపాటు సెక్యూరిటీగా ఉన్న దంపతులే (Couple of Nepalis) మరికొందరితో కలిసి ఆ చోరీకి పాల్పడ్డారు.
ఇంటి మనుషుల్లా చూసుకున్నా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటలో నివసించే వ్యపారి ఇంటి పనుల (Domestic work) నిమిత్తం కొంతకాలం క్రితం నేపాలి దంపతుల (Couple of Nepalis)ను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. సెక్యూరిటీగా ఉంటూ ఇంటి పనులు చూసుకొనే ఈ భార్యాభర్తలు కొన్ని రోజుల్లోనే యజమానిని ప్రసన్నం చేసుకున్నారు. ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చిన ఆ నేపాలి దంపతులను యజమాని కుటుంబం తన ఇంటి మనుషుల్లా చూసుకొన...




