Mumbai attack | భారత్‌కు ముంబై దాడుల ప్రధాన సూత్రధారి.. అప్పగించేందుకు అమెరికా ఆమోదం
ముంబై (Mumbai attack) దాడుల ప్రధాన సూత్రధారి తహవుర్ రానా (Tahawwur Rana)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానాను భారత్‌కు అప్పగించాలని అక్కడి సుప్రీంకోర్టు 2025 జనవరి 1న ఆదేశాలు జారీ చేయగా అదే న్యాయస్థానం (United States’ Supreme Court )లో అతడు పిటిషన్ దాఖలు చేశాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని విజ్ఞప్తి చేశాడు. అతడి ఈ అభ్యర్థనను అమెరికా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రానాను త్వరలో భారత్ (India)కు తీసుకురావడం ఖాయమైంది.
Mumbai attack Tragedy : ముంబై దాడులు.. తీరని విషాదం
ముంబై నగరంలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో అత్యంత భయానక ఘటనగా నిలిచింది. పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాదులు 166 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. పక్కాప్రణాళికతో ఈ ...


