Training aircraft crash : జనావాసాల మధ్య కూలిన విమానం..
Training aircraft crash : గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా (Gujarat’s Amreli district)లో ఈ రోజు ఓ దుర్ఘటన జరిగింది. ఒక ప్రైవేట్ విమానయాన శిక్షణ సంస్థకు చెందిన చిన్నవిమానం (small aircraft) జనావాసాల మధ్య కుప్పకూలింది (crashed). ఈ ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ (trainee pilot) అనికేత్ మహాజన్ (Aniket Mahajan) మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. విమానం ఒక్కసారిగా భూమి వైపు దూసుకొచ్చి కుప్పకూలిపోయిందని స్థానికులు తెలిపారు. భూమికి ఢీకొట్టిన సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ శబ్దం విని చుట్టుపక్కల వారు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Training aircraft crash : ఎందుకు.. ఎలా?
విమానం కూలిన ప్రదేశం నుంచి భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యం అందరినీ కలవరపరిచింది. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు. అయితే, ఎంత ...




