IMD Report : తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక
IMD Report | తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ ప్రకారం, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశముంది?
గురు, శుక్రవారాల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్ల...




