Vanajeevi Ramaiah | వనజీవి రామయ్య ఇక లేరు.. గుండెపోటుతో మృతి
Vanajeevi Ramaiah : ‘వనజీవి’ (Vanajeevi ) దరిపల్లి రామయ్య (Daripalli Ramaiah) కన్నుమూశారు. గుండెపోటుతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (ఏప్రిల్ 12, 2025) ఉదయం కన్నుమూశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత (Padma Shri awardee) అయిన రామయ్య మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో విషాదం అలుముకుంది.
పర్యావరణ రక్షణ కోసం…
ఖమ్మం రూరల్ మండలం (Khammam Rural Mandal) రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య (88) తన జీవితాన్ని పూర్తిగా పచ్చదనానికి అంకితం చేశారు. ప్రకృతి రక్షణను జీవిత లక్ష్యంగా మార్చుకొని, వృక్షాల పెంపకమే తన ధర్మంగా స్వీకరించిన ఆయనను తెలుగు ప్రజలు ‘చెట్ల రామయ్య’ అని ప్రేమతో పిలిచేవారు. వన సంపదను కాపాడుకోవాలని ఆయన పరితపించేవారు. ప్రతి చెట్టుకూ రక్షణ కల్పించాలనుకొనేవారు. స్వయంగా మొక్కలను విరివిగా నాటి (planted), వాటిని సంరక్షించడమే కాకుండా దీనిపై ప్రజల్లో అవగాహన...



