Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Adani : అదానీకి భారీ ఊర‌ట‌.. ‘ధారావి’పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌!
Business

Adani : అదానీకి భారీ ఊర‌ట‌.. ‘ధారావి’పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌!

Adani | ముంబైలోని ధారావి పునరుద్ధరణ ప్రాజెక్టుకు అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ మంజూరును బాంబే హైకోర్టు (Bombay High Court) స‌మ‌ర్థించింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటీష‌న్‌ను ఈ రోజు కొట్టేసింది. అభ్యంత‌రాల‌కు బ‌ల‌మైన కార‌ణాలు చూప‌క‌పోవ‌డంతో దీన్ని తిర‌స్క‌రిస్తున్నామ‌ని చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Adani Properties Private Ltd)కు టెండర్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (UAE-based Seclink Technologies Corporation) సంస్థ ఈ పిటీష‌న్‌ను 2022లో దాఖలు చేసింది. దీన్ని ప‌రిశీలించిన హైకోర్టు త‌న తీర్పును వెలువ‌రించింది. టెండ‌ర్ ఖ‌రారుతో వివాదం 2022లో నిర్వహించిన 259 హెక్టార్ల ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్ (Dhar...
Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం
Crime

Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

Fatal Accident : రాజ‌స్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు (Chemical) త‌ర‌లిస్తున్న ఓ ట్రక్కు అదుపు త‌ప్పి అనేక వాహనాలతో ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో 30 వాహ‌నాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. ఐదుగురు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు. 37 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. భారీ ప్రమాదం (Fatal Accident) ఎలా జ‌రిగిందంటే.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... రసాయన పదార్థాలు (కెమిక‌ల్స్‌) ర‌వాణా చేస్తున్న ఓ ట్ర‌క్కు జైపూర్‌- అజ్మీర్ జాతీయ ర‌హ‌దారి (National highway )పై అదుపు త‌ప్పి ఇతర వాహనాలను ఢీకొంది. దీంతో ట్రక్కులో ఉన్న రసాయనాలు అంటుకుని ఒక్క‌సారిగా మంటలు వ్యాపించాయి. చూస్తూ చూస్తుండానే 30కి పైగా వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళాలు కూడా ఆ వాహనాల వ‌ద్ద‌కు చేరుకోలేనంత‌గా మంట‌లు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంతో ...
Hyderabad Tourism |  హైద‌రాబాద్‌లో మరో ప‌ర్యాట‌క కేంద్రం… త్వరలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హం
State

Hyderabad Tourism | హైద‌రాబాద్‌లో మరో ప‌ర్యాట‌క కేంద్రం… త్వరలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హం

Hyderabad Tourism|  హైద‌రాబాద్‌లో మ‌రో ప‌ర్యాట‌క కేంద్రం ఆవిర్భ‌వించ‌నుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్య‌వస్థాప‌కుడు నంద‌మూరి తారక రామారావు 100 అడుగుల స్టాచ్యూ (NTR Statue) ఏర్పాటు కానుంది. మ‌హాన‌టుడుగానే కాకుండా రాజ‌కీయ నాయకుడిగా ప్ర‌జ‌ల గుండెలో చెర‌గ‌ని ముద్ర వేసిన ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao) గౌర‌వార్థం ఆయ‌న భారీ విగ్ర‌హాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించాల‌నే ప్ర‌తిపాద‌నను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదించారు. విగ్రహం ఎక్క‌డంటే... ఎన్టీఆర్ సాహిత్య క‌మిటీ స‌భ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని క‌లిశారు. ఆయ‌న కుమారుడు మోహ‌న‌కృష్ణ‌, క‌మిటీ అధ్య‌క్షుడు టి.డి.జ‌నార్ద‌న్‌, స‌భ్యుడు మ‌ధుసూద‌న‌రాజు సీఎంతో భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసే విష‌యంపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. విగ్ర‌హం ఏ...
RTA Corruption | అస్సలు తగ్గేదేలే…
Special Stories

RTA Corruption | అస్సలు తగ్గేదేలే…

చుక్కలు వేయడం ఆగొద్దు.. మనల్ని ఆపేదెవరంటున్న అధికారులు బరితెగించిన ఎంవీఐ ల వెనుక ఉన్నదెవరో? రవాణా శాఖ లో కలకలం రేపిన లంచాల వివరాలు చర్చనీయాంశమైన "సర్కార్" కథనం.. RTA Corruption in Hanmakonda | ఆ అధికారులు బరితెగించారు.ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నతాధికారి నుండి క్లర్క్ వరకు ఏ పనికి ఎంత లంచం తీసుకుంటున్నారో "ఆ కార్యాలయంలో కనకవర్షం" కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చినప్పటికి ఎలాంటి అదురు బెదురు లేకుండా దందాను కొనసాగిస్తున్నారు.రోజూ చుక్కల(లంచాల) రూపంలో లక్షల రూపాయల మామూళ్లు వస్తుండడంతో దందాను ఆపేందుకు అధికారులు ఇష్టపడడంలేదు."ఎవ్వరన్నా రానియ్ అస్సలు తగ్గేదేలే"అని పుష్ప-2 సినిమా రేంజులో అధికారులు డైలాగ్స్ కొడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కోడ్(చుక్క)వేయడం ఆగొద్దూ... మనల్ని ఆపేదెవరంటూ ప్రైవేట్ అసిస్టెంట్ లకు అధికారులు హుకుం జారీచేశారని దాంతో ఎవరైనా వస్తే అధికారులే చూసుకుంటానన్నప్పుడు మనకేం...
Hydra News | జోరు పెంచిన హైడ్రా.. హైద‌రాబాద్‌లో మళ్లీ కూల్చివేత‌లు
State

Hydra News | జోరు పెంచిన హైడ్రా.. హైద‌రాబాద్‌లో మళ్లీ కూల్చివేత‌లు

Hydra News : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) త‌న‌ జోరును పెంచింది. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌ల‌ను ముమ్మ‌రం చేసింది. తాజాగా హైద‌రాబాద్‌లోని మణికొండ మునిసిపాలిటీ (Manikonda Municipality) పరిధిలోని  అనురాగ్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్ ప్రాప‌ర్టీలో ఉన్న‌ దుకాణ స‌ముదాయాన్ని నేల‌మ‌ట్టం చేసింది. దీంతో నిర్వాసితులు, అధికారుల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకొని తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది.  అల్కాపురి కాలనీ (Alkapuri Colony)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కమర్షియల్‌ షెట్టర్స్‌ (Commercial shutters)ను అధికారులు తొలగించారు అనుమ‌తులు ఉన్నాయి : నిర్వాసితులు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా, పండ్లు, కూరగాయల దుకాణాలను తొలగించేందుకు హైడ్రా ఉపక్ర‌మించింది. దీంతో షాపు య‌జ‌మానులు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌మ వ‌ద్ద అన్ని ర‌కాల అనున‌మతులు ఉన్నాయ‌ని...
error: Content is protected !!