మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన పనులు
Indian Railways prepares for Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభమేళాలో భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా రైల్వేల పరంగా ఇండియన్ రైల్వేస్ ఉత్తరప్రదేశ్ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్‌తో కలిసి, ప్రయాగ్‌రాజ్‌లో రైల్వే ట్రాక్‌లను పునరుద్ధరిస్తోంది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభ్ 2025 సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం కోసం భారతీయ రైల్వే పలు ప్రాజక్టులను చేపట్టింది.
మౌలిక సదుపాయాల కల్పన
కోట్లాది మంది భక్తులు తరలివచ్చే కుంభమేళాలో రద్దీని నిర్వహించేందుకు ప్రయాగ్‌రాజ్ తోపాటు పరిసర ప్రాంతాలలో దాదాపు అన్ని లెవల్ క్రాసింగ్‌ల వద్ద రైలు అండర్ బ్రిడ్జిలు (RUBలు), రైల్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు) నిర్మించారు. ఈ పరిణామాలు మెగా జాతరకు ముందే పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చనున్...




