Hyderabad : 48 గంటలు హై అలెర్ట్.. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం
Hyderabad Ganesh immersion 2025 : గణేష్ నిమజ్జన మహోత్సవం కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, జలమండలి, ఎలక్ట్రిసిటీ, HMDA, పర్యాటక శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.
నిమజ్జనం కోసం కీలక ఏర్పాట్లు
72 కృత్రిమ కొలనులు, 20 ప్రధాన సరస్సుల్లో నిమజ్జన సౌకర్యం
134 స్థిర క్రేన్‌లు, 259 మొబైల్ క్రేన్‌లు సిద్ధంగా
హుస్సేన్ సాగర్‌లో 20 క్రేన్‌లు, బాహుబలి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
9 బోట్లు, DRF టీంలు, 200 ఈతగాళ్లు రెడీ
13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
హైదరాబాద్ పరిధిలో 303 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో సజావుగా శోభాయాత్ర జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 3 షిఫ్టులలో స్వచ్ఛత కార్యక్రమాలు 25 × 7 గంటలు విధుల్లో 15 వేలకు పైగా శానిటేషన్ సిబ్బందిని నియమించారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా ఊర...




