Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
Anganwadi Program | ములుగు జిల్లాలో అంగన్వాడీలకు ‘విజయ పాలు’
State, warangal

Anganwadi Program | ములుగు జిల్లాలో అంగన్వాడీలకు ‘విజయ పాలు’

ప్రీస్కూల్ చిన్నారులకు రోజూ 100 మి.లీ పాలు పంపిణీ ప్రారంభం పైలెట్ ప్రాజెక్ట్ గా ములుగు జిల్లా.. దేశంలోనే తొలిసారి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క New Anganwadi Program Started in mulugu | తెలంగాణలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి, పైలెట్ ప్రాజెక్ట్‌గా ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లలకు రోజూ 100 మిల్లీలీటర్ల పాలు పంపిణీ చేయడం మొదలైంది. ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రం లోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజ‌రై మాట్లాడారు. రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి మన రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ముందుకుసాగుతోంద‌ని అన్నారు. వెనుక‌బ‌డిన ములు...
Ibomma Piracy Racket : 65 మిర్ర‌ర్ సైట్లు, 21 వేల సినిమాలు… రూ.20 కోట్ల అక్రమ సంపాదన!
Cinema, Crime

Ibomma Piracy Racket : 65 మిర్ర‌ర్ సైట్లు, 21 వేల సినిమాలు… రూ.20 కోట్ల అక్రమ సంపాదన!

Ibomma Piracy Racket | తెలుగు సినీ పరిశ్రమను ఎన్నో సంవత్సరాలుగా వేదిస్తున్న పైరసీ రాకెట్‌ను ఛేదించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ((CP Sajjanar) ) వెల్లడించారు. ఐబొమ్మ (Ibomma) వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని అరెస్ట్ చేయడం ద్వారా పరిశ్రమకు ఎంతో ఊర‌ట క‌లిగింద‌ని పేర్కొన్నారు. ఇప్పటికే రవిపై ఐటీ యాక్ట్‌, కాపీరైట్ యాక్ట్‌ కింద నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌ బాబుతో పాటు దర్శకుడు రాజమౌళి సీపీ సజ్జనార్‌తో సోమ‌వారం భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్‌, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశామ‌న్నారు. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం క‌లిగించాడ‌ని, పైరసీ (Ibomma Piracy Racket) ద్వారా చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమ...
Shocking Incident : టీనేజ్ యువకుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువతులు
Viral

Shocking Incident : టీనేజ్ యువకుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువతులు

Shocking Incident in Punjab | ఓ టీనేజ్​ యువకుడిపై నలుగురు యువతులు లైంగిక దాడికి పాల్పడిన షాకింగ్​ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో దేశంలో అమ్మాయిల భద్రతకే కాదు.. ఇక మీదట అబ్బాయిల భద్రత కూడా పెనుసవాల్‌ ‌గా మారిందని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇటీవల రాత్రి సమయంలో ఈ యువతులు మద్యం మత్తులో ఒక టీనేజ్ యువకుడిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటుచేసుకుంది. రాత్రంతా కారులో తిప్పుతూ అతనిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక.. నగర శివార్లలో పొదల్లోకి తీసుకెళ్లి అతనిపై లైంగికత దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అతడిని వదిలేసి పరారయ్యారు. మరుసటి రోజు అతను పోలీసుల దగ్గరకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా కామంధులు మారడంలేదు. ...
Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌
State, Hyderabad

Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు ఎగ్జిట్‌ పోల్స్‌ ఊపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం Jubilee Hills Election Result | హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) ఫలితం మరో కొన్ని గంటల్లో తేలనుంది. అధికా కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష‌ బీఆర్‌ఎస్, బీజేపీ నేత‌లు హోరాహోరీగా ప్ర‌చారం చేశాయి. అయితే సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తే, జూబ్లీహిల్స్‌పై జెండా ఎగరేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డింది. బీజేపీ కూడా సైలెంట్‌గా ప్రచారం జరిపి, తామే సర్ప్రైజ్‌ ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. సుమారు నెలరోజుల పాటు మూడు పార్టీలూ తమ టాప్‌ లీడర్లను నియోజకవర్గంలో క‌లియ‌దిరిగారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సాగిన ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా రాజ‌కీయ సెగ రేపింది. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌తో కాంగ్రెస్‌లో ఉత్సాహం అయితే ఎగ్జిట్‌ ...
Medaram | భక్తుల నమ్మకాల‌తో ఆటలాడొద్దు
State

Medaram | భక్తుల నమ్మకాల‌తో ఆటలాడొద్దు

ప్ర‌తిప‌క్షాల‌కు మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్‌ వరంగల్​/ ములుగు : మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ చాలా పవర్‌ఫుల్‌ అంటూ ప్రతిపక్షాలు, కొన్ని రాజకీయ పత్రికలు దేవుడిపై రాజకీయాలు, తప్పుడు వార్తలు రాయడం సరికాదని మంత్రి సీతక్క హితవు పలికారు. గత ప్రభుత్వం రూ.10 కోట్లతో చెక్‌ డ్యాములు కట్టి వాటిని కూల్చడానికి రూ.కోటి ఖర్చు చేసిందని, కానీ తమ ప్రభుత్వం అలా కాదని, పెట్టిన ప్రతీ రూపాయి శాశ్వతంగా నిలిచిపోయేలా కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. అధికారం కోసం, అలంకారం కోసం కాదు.. మా అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం భక్తుల విశ్వాసం కాపాడేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. మరో వారం రోజుల్లో పనుల అభివృద్ధి మీకే కనిపిస్తుందని, దేవుడి దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు.. రాజకీయాలు వద్దని వార్నింగ్​ ఇచ్చారు. ములుగు జిల్లా (Mulugu) సమ్మక్క సార...
error: Content is protected !!