Nobel Peace Prize 2025 : వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
                    Nobel Peace Prize 2025 : 2025 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల చెదిరిపోయింది. వెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడో (Maria Corina Machado) కు ఈ గౌరవం లభించింది. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఆమె అవిశ్రాంత పోరాటం చేసినందుకు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. వెనిజులాను నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మారడానికి ఆమె నాయకత్వం, పోరాటాన్ని నోబెల్ కమిటీ ప్రత్యేకంగా హైలైట్ చేసింది.
ఆమె ప్రయత్నాలను "ప్రజాస్వామ్య విలువల ప్రపంచ రక్షణకు చిహ్నం"గా నోబెల్ కమిటీ అభివర్ణించింది. ఇది డోనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతి గెలుచుకోవాలనే కలను చెదరగొట్టింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించారు. "ఆమె ప్రాణాలకు తీవ్రమైన బెద...                
                
             
								


