ఇండిగో కోచిన్ విమానం రద్దుపై తీవ్ర అసంతృప్తి.. నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్టు
Ayyappa Devotees Protest : శబరిమల యాత్రకు బయల్దేరిన అయ్యప్ప భక్తులు (Ayyappa Devotees) హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద ఈ రోజు ఆందోళన (Protest) కు దిగారు. కోచిన్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రమే బయల్దేరాల్సిన విమానం రద్దు అయ్యింది. దీంతో అయ్యప్ప భక్తులు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్నారు.
స్పష్టత ఇవ్వని అధికారులు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం వరకు కూడా విమానం బయల్దేరకపోవడం అయ్యప్ప (ayyappa) భక్తుల అసహనానికి కారణమైంది. విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఎయిర్‌పోర్టు అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో నిరసనకు దిగారు. మకర జ్యోతి సమయంలో శబరిమలలో ఎక్కువ రద్దీ ఉంటుందని ముందస్తుగానే బయల్దేరిన అయ్యప్ప భక్తులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు తప్పలేదు. ఇండిగో విమానం షెడ్యూల్ ప్రకారం బయల్దేరకపోవడమే కాకుండా రీషెడ్యూల్ సమయంపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘స్వామియే శరణం అయ్యప్ప..’ అంటూ విమానాశ్రయం అంతా మార్మోగేలా నినాదాలు చేశారు. ఇండిగో విమాన సంస్థ అయ్యప్ప భక్తుల మనోభావాలను గౌరవించడం లేదని ఆరోపించారు.
ఆధ్యాత్మిక యాత్రకు ఆదిలోనే ఇబ్బందులు
శబరిమల యాత్ర చాలా మంది భక్తులకు ప్రతిష్ఠాత్మకం. అయ్యప్ప మాల వేసుకుని దీక్ష (ayyappa swamy deeksha)లో ఉన్నవారు అనేక మంది అక్కడికి బయల్దేరుతారు. ఇందుకు ముందస్తుగానే ప్రణాళికను రూపొందించుకుంటారు. నిర్ణీత రోజుల్లేనే ఇరుముడి కట్టుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక పూజలు చేసుకొని శబరిమలకు బయల్దేరాల్సి ఉంటుంది. ఈ షెడ్యుల్‌లో ఆలస్యమైతే తీవ్ర ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ప్లానింగ్ దెబ్బతిని యాత్రలో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విమానంలో శబరిమలకు బయల్దేరుదామని ప్రణాళికను రూపొందించుకున్న భక్తులకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. గురువారం టేకాఫ్ కావాల్సిన ఇండిగో విమానం రద్దు కావడం, దాని రీషెడ్యూల్ సమయంపై స్పష్టత రాకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది.
“ఇది మా ఆధ్యాత్మిక యాత్ర. విమానయాన సంస్థ బాధ్యతగా వ్యవహరించాలి.” అని అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ayyappa Devotees Protest: ప్లానింగ్ దెబ్బతిందని ఆవేదన
సాధారణంగా అయ్యప్ప భక్తులు (Devotees) హైదరాబాద్ నుంచి కోచిన్‌కు విమానంలో చేరుతారు. అక్కడి నుంచి కేరళ RTC బస్సులు లేదా కారును అద్దెకు తీసుకుని శబరిమలకు బయల్దేరుతారు. పంబా వరకు ప్రయాణించి, అక్కడి నుంచి కాలినడకన దైవదర్శనానికి వెళ్తారు. కోచిన్ విమానం రద్దు కావడంతో ఈ మొత్తం యాత్రా ప్రణాళిక భంగమైందని భక్తులు అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







