హైదరాబాద్ బాలానగర్ (Balanagar) ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘటనలో మృతురాలిని చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు. ఆమె భర్త అనిల్ కుమార్ తో కలిసి పద్మారావు నగర్ ఫేజ్-1, బాలానగర్ లో నివాసముంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యతవల్లి ఉన్నారు. అయితే స్థానికుల కథనం మేరకు కొంతకాలంగా భర్తతో విభేదాలు, వ్యక్తిగత సమస్యల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలక్ష్మీ, క్షణికావేశంతో తన ఇద్దరు పిల్లలను చంపి అనంతరం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరో ఘటనలో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ మండలంలోని గంభీరావుపేట గ్రామానికి చెందిన సైదం కల్పన(28) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమె వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    