Bhairavam Movie Review | నాంది, ఉగ్రం మూవీలతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ కనక మేడల డైరెక్షన్లో మంచు మనోజ్ ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా అతిథి శంకర్, దివ్య పిళ్ళై,ఆనంది హీరోయిన్ లుగా యాక్ట్ చేసిన మూవీ భైరవం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…
స్టోరీ..
దేవిపురం అనే ఊరిలో గజపతి(మనోజ్), అతడి అనుచరుడు శీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్),వరద(నారా రోహిత్ ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరికి ఏ కష్టం వచ్చినా వీరు ముగ్గురు అండగా నిలబడతారు.ఆ ఊర్లో ఒక దేవాలయం ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆ దేవాలయానికి సంబంధించినవి ఉంటాయి. వాటిని దేవాలయ శాఖా మంత్రి (శరత్ లోహితశ్వ) ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. కొన్ని పరిస్థితుల్లో గజపతి వాళ్లవైపు ఉండాల్సి వస్తుంది. దీనిపై వరద వ్యతిరేకిస్తాడు. మంత్రి దేవాలయ భూములను దక్కించుకున్నాడా..? గజపతి వారి వైపు ఎందుకు నిలబడాల్సి వచ్చింది..? అసలు ఇందులో శీను పాత్ర ఏంటి..? అనేది చూడాలి.
Bhairavam Movie Review : మూవీ ఎలా ఉందంటే…
తమిళం మూవీ గరుడన్ కి రీమేక్ అయినా ఈ మూవీ ట్రీట్మెంట్ మార్చి తెరకెక్కించారు. ఊరిలో ఒక గుడి.. దాని భూములను దక్కించుకునేందుకు కొన్ని శక్తులు… వారిని ఎదుర్కొనే హీరో… ఇది ఎప్పటి నుండో తీస్తున్న ఫార్మాట్ అయినా కూడా ట్రీట్మెంట్ కొత్తగా ఇస్తూ హిట్టు కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ పాయింట్ తోనే ఈ మూవీని తీశారు. ఒరిజినల్ మూవీలో క్యారెక్టర్ లు ఆగుపడకుండా ఒక కథ మాత్రమే ఆడియన్స్ కు అగుపడుతుంది. కానీ భైరవంలో ముగ్గురు వెల్ నోన్ యాక్టర్స్ ఉండడంతో వారి క్యారెక్టర్లకు సమానంగా ఇంపార్టెంట్ ఇవ్వడంలో దృష్టి పెట్టాల్సి వచ్చింది. దీని వల్ల ఒరిజినల్ లో ఉన్న ఫీల్ ఇందులో రాలేదనిపిస్తోంది. ఫస్టాఫ్ మామూలుగానే నడిచినా ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఆడియన్స్ అక్కడక్కడ థ్రిల్ చేస్తుంది. సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలు అదరగొట్టేలా ఉన్నాయి. హీరోల క్యారెక్టర్ ల మీద పెట్టిన ఫోకస్ మిగతా క్యారెక్టర్ ల మీద అంతగా పెట్టలేదని అనిపించింది. కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టలా తీయడం ప్లస్ గా మారుతుందని చెప్పొచ్చు. ఇక మూవీలోని క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ ఆయువు పట్టులా నిలిచాయని చెప్పచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…
నాంది, ఉగ్రం సినిమాలతో హిట్టు అందుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల ఈ మూవీ ని కూడా ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దడానికి ట్రై చేశాడు. రీమేక్ మూవీలను ఒరిజినల్ మూవీతో కంపారిజన్ చేస్తారు. దాన్ని దాటడమే సక్సెస్. చాలావరకు ఈ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.ఇంకా కథను నాచురల్ గా తీసుకెళ్తే సూపర్ రెస్పాన్స్ వచ్చేదనిపించింది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్టింగ్ లో సూపర్ అనిపించుకున్నాడు. తన క్యారెక్టర్ సరికొత్తగా ఉండగా తనకు జోడిగా నటించిన అదితి శంకర్ పాత్ర మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పచ్చు. వీరిద్దరి కాంబో స్క్రీన్ పై తేలిపోయింది. మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత ఆక్ట్ చేయడంతో ఫ్యాన్స్ చాలా ఊహించుకున్నారు. వారికి తగ్గట్టుగానే తన పాత్రలో ఒదిగిపోయాడు. డిఫరెంట్ షేడ్స్ చూపెట్టి తనలోని కొత్త నటనని చూపెట్టాడు. నారా రోహిత్ కూడా తన క్యారెక్టర్ కి ప్రాణం పోశాడు. మిగిలిన నతేనటులు వారి పాత్రల మేరకు బాగానే యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన శ్రీ చరణ్ పాకాల అందించిన పాటలు ఒక మోస్తారుగానే ఉన్నా బిజీఎం ఓ లెవెల్లో ఉంది. కొన్ని కొన్ని సీట్లు బిజీఎం వల్ల మరింత ఎలివేట్ అయ్యాయి. నిర్మాణ విలువలు, హరి వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్ గా మూవీ యాక్షన్ ఇష్టపడే మూవీ లవర్స్ కి పండుగ అని చెప్పొచ్చు.