Sarkar Live

Vijay Antony | బిచ్చగాడు-3 కూడా ఉంది..!

2027లో రిలీజ్ కానున్నట్లు విజయ్ ఆంటోనీ ప్రకటన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony)యాక్ట్ చేసిన బిచ్చగాడు (Bicchagadu) మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం( Brahmosthavam) మూవీతో పోటీపడి మరీ

Vijay Antony

2027లో రిలీజ్ కానున్నట్లు విజయ్ ఆంటోనీ ప్రకటన

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony)యాక్ట్ చేసిన బిచ్చగాడు (Bicchagadu) మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం( Brahmosthavam) మూవీతో పోటీపడి మరీ సూపర్ హిట్టు అందుకుంది.ఈ మూవీకి వెంకటేష్ హీరోగా యాక్ట్ చేసిన శీను మూవీ డైరెక్టర్ శశి(Shashi) డైరెక్ట్ చేసి సూపర్ సెన్సేషన్ హిట్టు అందించారు.

విజయ్ ఆంటోనీ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద ఎస్సెట్. తన బీజేఎం తో ఆడియన్స్ ను కట్టిపడేసి సీన్స్ కి ప్రాణం పోశాడు. ఇప్పటికీ కూడా చాలామందికి మోస్ట్ ఫేవరెట్ ఫిలిం గా నిలిచిపోయింది. విజయ్ ఆంటోనీ బిచ్చగాడిగా ఎమోషనల్ సీన్స్ లో అందరితో కంటతడి పెట్టించాడు.తెలుగులో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మహాత్మ, రవితేజ హీరోగా వచ్చిన దరువు సినిమాలకు మ్యూజిక్ అందించి మంచి పేరు తెచ్చుకుని నటుడిగా మారి బిజీ అయ్యాడు.

Vijay : బిచ్చగాడు 2 కి విజయ్ డైరెక్షన్

బిచ్చగాడు మూవీకి ముందు కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసి డిఫరెంట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ తను యాక్ట్ చేసిన అన్ని మూవీస్ కంటే బిచ్చగాడు మూవీతో తన రేంజ్ మారిపోయింది. దీని తర్వాత బిచ్చగాడు 2 కూడా రిలీజ్ అయి మంచి వసూల్లే సాధించింది. ఫస్ట్ మూవీ ఆడినంతగా ఆడకపోయినా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీకి మ్యూజిక్ తో పాటు డైరెక్షన్ కూడా విజయ్ ఆంటోనీ నే చేశారు.

2027 లో రిలీజ్….

ఇప్పుడు ఈ మూవీ మూడో పార్ట్ కూడా రాబోతున్నట్లు స్వయంగా హీరోనే వెల్లడించారు. విజయ్ లేటెస్ట్ మూవీ మార్గన్ ది బ్లాక్ డెవిల్.క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని లియో జాన్ పాల్ డైరెక్షన్ చేశారు. ఈ నెల 27 న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ లో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 3 గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీకి తనే డైరెక్షన్ చేస్తూ మ్యూజిక్ అందిస్తానని చెప్పుకొచ్చారు. 2027 లో రిలీజ్ చేయనున్నట్టు క్రేజీ న్యూస్ చెప్పారు. రెండు పార్ట్ లతో అదరగొట్టిన ఈ మూవీ మూడో పార్ట్ వస్తుందని తెలియడంతో సినీ లవర్స్ ఖుషీ అవుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!