తెలంగాణ రాష్ట్ర రాజకీయాల (Telangana politics)లో ఒకప్పుడు దుమ్మురేపిన పార్టీ BRS. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుస పరాజయాల (BRS party losses)తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పదేళ్లు ఏకదాటిగా అధికారంలో ఉన్న ఈ ఉద్యమ పార్టీ వెనుకబడిపోయింది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్, మునిసిపల్ ఎన్నికల్లో ఓటములను చవి చూసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election result)లోనూ అదే పరిస్థితి ఎదురైంది.
వరుస పరాజయాలకు కారణాలు ఇవేనా?
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో సంస్కరణలు చేపట్టిన BRS.. ప్రజాదరణ పొందింది. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో మంచి ఇమేజ్‌ను సంపాదించుకుంది. అయితే.. ఏ పార్టీ అయినా ఎప్పటికీ అదే స్థాయిలో ప్రజాదరణను నిలబెట్టుకోవడం కష్టమే. ప్రభుత్వంపై వ్యతిరేకత, వ్యవస్థపై అసంతృప్తి, కొత్త నాయకత్వ అవసరం వంటి అంశాలు ఏదో ఒక దశలో ముందుకు వస్తాయి. BRS విషయంలో అదే జరిగిందని తెలుస్తోంది.
KCR : పూర్వవైభవానికి కసరత్తు
BRS వరుస ఓటములు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలవరపెడుతున్నాయని తెలుస్తోంది. పరాజయాలను సమీక్షించుకొని తప్పిదాలన సరిదిద్దుకోకపోతే ఇమేజ్‌ను పూర్తిగా కోల్పోతామని ఆయన భావిస్తున్నట్టు పార్టీ ముఖ్యనేతల్లో చర్చ జరుగుతోంది. BRSకు పూర్వ వైభవం తెచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం (KCR latest actions) తీసుకున్నారని సమాచారం. పార్టీని ఇకపై అదే పాత విధానాలతో నడపడం కుదరదని ఆయన భావిస్తున్నారని తెలిసింది. పార్టీ మొత్తం నిర్మాణం, వ్యవస్థ, నాయకత్వ పటిష్ఠత తదితర అంశాలపై కేసీఆర్ దృష్టిసారిస్తున్నారని పలువురు ముఖ్యనేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన అంతర్గత సమావేశాల్లో చర్చించారని తెలిసింది.
రాష్ట్రస్థాయి నాయకత్వంలో మార్పులు?
పార్టీ ఓటములకు ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో నాయకత్వం బలహీనపడటం, కొత్త నేతలు ఎదగకపోవడం, ప్రజలతో అనుసంధానం కొరవడటం అని విశ్లేషణలు వస్తున్నాయి. దీనిపై కేసీఆర్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అందుకే త్వరలోనే రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పలు కీలక మార్పులు (BRS leadership changes) చోటుచేసుకునే అవకాశాలున్నాయి.
కొత్త రక్తాన్ని తీసుకురావడం, క్రియాశీలక నాయకత్వాన్ని ముందుకు తేవడం, గ్రౌండ్ లెవల్‌లో పని చేసే వారిని పునఃవ్యవస్థీకరించడం వంటి కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. పార్టీకి తగిన చైతన్యం రావాలంటే నాయకత్వ మార్పు చాలా అవసరమని చాలా మంది సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారని సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







