హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌గురువారం ‘చలో బస్‌భవన్’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి. బీఆర్‌ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయమే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
ఇక, చలో బస్‌భవన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్ వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.
పోలీసుల చర్యపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపేందుకు ఇంతమంది పోలీసులను పంపారని మండిపడ్డారు. తమను నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఎన్ని రకాల కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకునేవరకు నిరసన తెలుపుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    