Sarkar Live

Salaries in India | భార‌త్‌లో జీతాల స‌గ‌టు పెరుగుద‌ల 9.2%.. ఎందుకంటే..

Salaries in India : భార‌త‌దేశంలోని ప్రైవేటు రంగంలో ఉద్యోగుల జీతాలు 2025లో సగటున 9.2 శాతం పెరుగుతాయట‌! 2024లో 9.3 శాతం పెరుగుదలతో పోలిస్తే ఇది స్వల్ప తగ్గుదల. ముఖ్యంగా తయారీ రంగం, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs)లో వేత‌నాల్లో

Salaries in India

Salaries in India : భార‌త‌దేశంలోని ప్రైవేటు రంగంలో ఉద్యోగుల జీతాలు 2025లో సగటున 9.2 శాతం పెరుగుతాయట‌! 2024లో 9.3 శాతం పెరుగుదలతో పోలిస్తే ఇది స్వల్ప తగ్గుదల. ముఖ్యంగా తయారీ రంగం, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs)లో వేత‌నాల్లో ఈ ప్ర‌భావం ఉంటుంద‌ని ‘సాలరీ ఇన్‌క్రీస్ అండ్ టర్నోవర్ సర్వే 2024-25 ఇండియా’ బుధ‌వారం వెల్ల‌డించిన నివేదిక‌లో పేర్కొంది. 2022లో కంపెనీలు ‘గ్రేట్ రిజిగ్నేషన్’ ప్రభావంతో 10.6 శాతం జీతాల పెరుగుదల ఉండ‌గా, అప్పటి నుంచి తగ్గుదల ధోరణి కనిపిస్తోంది. 2025లో 9.2 మాత్ర‌మే వేత‌నాల పెరుగుద‌ల ఉంటుంద‌ని నివేదిక చెబుతోంది. 45 పరిశ్రమల్లోని 1,400కి పైగా కంపెనీల డేటాను అధ్య‌య‌నం అనంత‌రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Salaries in India : కార‌ణాలు.. ప్ర‌భావం

వేత‌నాల పెరుగుదల ( Salaries Hike ) అనేది పరిశ్రమల వారీగా వేరుగా ఉంటాయని నివేదిక చెబుతోంది. ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్, ఆటోమొబైల్ తయారీ రంగాలు అత్యధిక వేత‌నాల పెరుగుదలను బడ్జెట్ చేస్తున్నాయని పేర్కొంది. వీటి త‌ర్వాతి స్థానంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, రిటైల్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్, లైఫ్ సైన్సెస్ రంగాలు ఉన్నాయ‌ని తెలిపింది. అనేక అనిశ్చితులున్నప్పటికీ భారతదేశ ఆర్థిక అవకాశాలు స్థిరంగా ఉన్నాయ‌ని, గ్రామీణ డిమాండ్ మెరుగుపడటం, ప్రైవేట్ రంగం వేగాన్ని పుంజుకోవ‌డం ఇందుకు కార‌ణ‌మ‌ని Aon టాలెంట్ సొల్యూషన్స్ పార్ట‌న‌ర్ అండ్‌ రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ రూపాంక్ చౌద‌రి అంటున్నారు. జీతాల పెరుగుదలలో ఈ స్వల్ప తగ్గుదల భౌగోళిక, ఆర్థిక పరిణామాలు, US వాణిజ్య విధానాల ప్రభావం, మధ్యప్రాచ్యంలో సంక్షోభం, జనరేటివ్ AI పురోగతుల వేగం వంటి అంశాలు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

ఇది దేనికి సంకేతం?

ఉద్యోగ మార్పిడి రేట్లు 2023లో 18.3 శాతం ఉండ‌గా 2022లో 21.4 శాతం నుంచి 2024లో 17.7 శాతానికి తగ్గాయని, ఇది ‘గ్రేట్ రిజిగ్నేషన్’ తర్వాత పెద్ద టాలెంట్‌ఫుల్‌ లభ్యతను సూచిస్తుందని ఈ స‌ర్వే ద్వారా తెలుస్తోంది. టాలెంట్ లభ్యతలో ఈ స్థిరత్వం స్వయం ఉపాధి, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతున్నప్పటికీ పెరిగిన కార్మిక శక్తి పాల్గొనడంతోపాటు కంపెనీలు వ్యూహాత్మకంగా వర్క్‌ఫోర్స్ స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, సంస్థాగత మద్దతుపై దృష్టి పెట్టడానికి అనుకూల సమయాన్ని ఇది సూచిస్తుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!