Sarkar Live

CM Fire On Allu Arjun | అల్లు అర్జున్‌కు కన్ను పోయిందా.. కాలు పోయిందా..?

CM Revanth Reddy Fire On Allu Arjun : అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటుడు అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ కు రావద్దని అల్లు అర్జున్ కు

CM Fire On Allu Arjun


CM Revanth Reddy Fire On Allu Arjun : అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటుడు అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ కు రావద్దని అల్లు అర్జున్ కు పోలీసులు సూచించినా ఆయన వచ్చారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ ఘటనలో ఆయన బాధ్యత మరిచిపోయి వ్యవహరించారని అన్నారు. సంధ్య థియేటర్ కు హీరో, హీరోయిన్, సినిమా యూనిట్ కు పోలీసులు సమాచారమిచ్చారని చెప్పారు. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా అల్లు అర్జున్ సంధ్య (Sandhya theater )థియేటర్ కు వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సినిమా థియేటర్ కు అల్లు అర్జున్ (Allu Arjun) తన కారులో రోడ్డు షోలో భాగంగా అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లడంతో ఆయనను చూసేందుకు అభిమానులు సంధ్యా ధియేటర్ కు భారీగా వచ్చారని తెలిపారు. థియేటర్ లో గేటు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే రేవత తన కొడుకు శ్రీతేజ్ ను కాపాడుకునేందుకు యత్నించింది. తన కొడుకు చేయి పట్టుకొనే రేవతి కన్ను మూసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. శ్రీతేజకు అక్కడే ఉన్న పోలీసులు సీపీఆర్ చేసి హాస్పిటల్ కు తీసుకెళ్లారని చెప్పారు.

శ్రీతేజ్ ను పరామర్శించేందుకు ఒక్కరైనా వచ్చారా?

హాస్పిటల్లో 20 రోజులుగా చికిత్స పొందుతున్న శ్రీతేజ (Shri tej)ను కానీ, అతడి కుటుంబాన్ని సినీ ప్రముఖులు ఒక్కరైనా పరామర్శించారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హీరో అల్లు అర్జున్ కు కన్ను పోయిందా? కాలు పోయిందా? ఒక్క పూట జైలులో ఉన్నారని ఆయన్ను పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఇంటికి వెళ్లి పరామర్శించారు. చావు బతుకుల మధ్య ఉన్న ఆ బాలుడిని ఒక్కరైనా పట్టించుకున్నారా? అని మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు తనపై సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా తిడుతున్నారు. ఒక పార్టీ నాయకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సినిమా హీరోలైతే ఏ తప్పు చేసినా చట్టాలకు లోబడే ఉండాలన్నారు. తొక్కిసలాట కేసులో తాము చట్టపరంగానే వ్యవహరించామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాత్రికి రాత్రే జైలు నుంచి ఎలా విడుదల చేయాలని సీఎం ప్రశ్నించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?