Pharmaceutical Department | ఫార్మాస్యూటికల్ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగు పడనున్నాయి. ఈ రంగంలో నెలకొన్న నిపుణుల కొరతను అధిగమించడానికి కసరత్తు జరుగుతోంది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE), బల్క్ డ్రగ్ మెనిఫెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BDMAI) మధ్య ఇందుకు అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడానికి ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. తద్వారా ఫార్మా పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధిస్తూ శిక్షణ ఇవ్వనున్నారు.
ఫార్మా రంగంలో సవాళ్లను అధిగమించేందుకు..
విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, నైపుణ్యాల అభివృద్ధి చేయడానికి ఈ కొత్త కార్యక్రమం దోహదపడుతుంది. ఫార్మా పరిశ్రమల సహకారంతో ఇంటర్న్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లు, లైవ్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తారు. వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవం కల్పిస్తారు. ఫార్మాస్యూటికల్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారు.
నేపుణ్యంతో కూడిన ఉద్యోగావకాశం
ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో వేగంగా మారుతున్న సాంకేతికతలు, అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం చాలా అవసరం. ఇందుకు TGCH, BDMAI ముందకొచ్చాయి. పరిశ్రమల నిపుణులు, విద్యావేత్తల ద్వారా విద్యార్థులకు తాజా పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించనున్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత విద్యార్థులు వెంటనే ఉద్యోగంలో చేరడానికి సిద్ధంగా చేస్తాయి. .
స్కిల్ డెవలప్మెంట్ కు దోహదం
విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, వారికి వివిధ రకాల నైపుణ్యాలను అందించడం చాలా ముఖ్యం. TGCH, BDMAI అందిస్తున్న కార్యక్రమం కింద విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్, వివిధ సమస్యల పరిష్కార నైపుణ్యాలు వంటి సాఫ్ట్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ నైపుణ్యాలు విద్యార్థులకు ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి, కార్యాలయంలో సమర్థంగా పనిచేయడానికి సహాయపడతాయి.
ప్రయోగాత్మక అనుభవం
సిద్ధాంతపరమైన జ్ఞానంతో పాటు విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవం కూడా చాలా అవసరం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, వర్క్షాప్లతోపాటు లైవ్ ప్రాజెక్ట్‌లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీటి ద్వారా విద్యార్థులు ఫార్మా పరిశ్రమలో పనిచేసే విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటారు తద్వారా . తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. అంతేకాదు.. ఫార్మా నిపుణులతో కలిసి పనిచేయడం వల్ల విద్యార్థులకు విలువైన అనుభవం, పరిజ్ఞానం లభిస్తుంది.
పరిశోధనలు.. ఆవిష్కరణలు
ఫార్మాస్యూటికల్ రంగంలో నిరంతరం కొత్త సవాళ్లు ఎదురవుతుంటాయి. వీటిని పరిష్కరించడానికి పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం చాలా అవసరం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అధ్యాపకులు కలిసి పరిశోధన ప్రాజెక్టులలో పాల్గొంటారు. కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తారు. ఇది ఫార్మాస్యూటికల్ రంగంలో రాణించడానికి దోహదం చేస్తుంది.
ఈ ప్రోగ్రాం ఎంత ప్రయోజనకరమంటే..
ఈ కార్యక్రమం విద్యార్థులకు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, పరిశ్రమకు నైపుణ్యం కలిగిన వారు లభిస్తారు. దీంతో పాటు ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుంది.
Pharmaceutical Industry : భవిష్యత్ అవసరాలకు..
ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగించడానికి, ఫార్మా పరిశ్రమ (Pharmaceutical Industry) విద్యా సంస్థల మధ్య నిరంతర సహకారం అవసరం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించడానికి, మరిన్ని మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రణాళికలు రూపొందించాలి. ఈ కార్యక్రమం ద్వారా ఫార్మాస్యూటికల్ రంగంలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను అధిగమించొచ్చు.దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేయొచ్చు.
సక్సెస్ ఫుల్ కెరీర్ కోసం
Career in Pharmaceutical Industry : ఫార్మాస్యూటికల్ రంగంలో విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందడుగు. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య, శిక్షణ లభిస్తుంది. వారు విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకోవడానికి అవకాశం లభిస్తుంది
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..