APGVB | ఖాతాదారులకు అలర్ట్.. ఏపీజీవీబీ ఇక ఉండదు..
APGVB Bank Merger : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (APGVB ) తెలంగాణలో ఇక ఎక్కడా కనిపించదు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (TGB)లో అది కలవనుంది. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. 493 శాఖలు ఉన్న APGVB తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో విలీనం కానుంది. మొత్తం 928 శాఖలతో కొత్త రూపం దాల్చనుంది. ఇది రూ. 70 వేల కోట్ల లావాదేవీలను నిర్వహించనుందని అంచనా.
ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకులో భాగంగా..
రాష్ట్రాల వారీగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏపీజీవీబీని టీజీబీలోకి విలీనం చేయాలని నిర్ణయించింది.ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకు స్ఫర్తితో ఈ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) 2025 జనవరి 1న ఆవిష్కరించనుందని చైర్‌పర్సన్ ఇ.శోభ తెలిపారు. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ ...