LPG Price Hike : వినియోగదారులకు షాక్..పెరిగిన LPG గ్యాస్ ధరలు
LPG Price Hike : డిసెంబర్ నెల మొదటి రోజే ప్రజలు షాక్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (LPG Price Hike) ధరలు పెరిగాయి. ఈ క్రమంంలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర స్వల్పంగా పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1802 నుంచి రూ.1818.50 కు పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.16.5 ఎగబాకింది. IOCL వెబ్‌సైట్ ప్రకారం ఈ రేట్లు ఈరోజు డిసెంబర్ 1, 2024 నుంచే అమల్లోకి వొచ్చాయి.
దేశీయ LPG సిలిండర్ ధరలు
గృహ వినియోగదారులకు ఊరట కలిగించేలా 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగలేదు. చమురు కంపెనీలు వీటి ధరలను పెంచకపోవడం విశేషం. చివరగా జూలైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీంతో ఆగస్టు తర్వాత అప్పటి నుంచి నేటి వరకు ఈ సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలో దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఈరోజు పాట్నా...