ATM లావాదేవీలపై కొత్త నిబంధనలు – ATM transactions
ATM transactions | హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల మేరకు, బ్యాంకులు ఈరోజు నుంచి అంటే మే 1 నుంచి ATM లావాదేవీలకు కొత్త చార్జీలను అమలుచేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ విధించిన కొత్త మార్గదర్శకాలు ఉచిత ATM లావాదేవీలకు పరిమితులు విధించింది. అలాగే, ఉచిత లావాదేవీలు ముగిసిన తర్వాత ఛార్జీలను సవరించింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులు ఇప్పుడు వారికి సంబంధించిన బ్యాంకుల నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల నుండి మూడు ఉచిత ATM లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇదే మెట్రోయేతర నగరాల్లో ఐదు లావాదేవీలను ఉచితంగా పొందవచ్చు. పరిమితి మించితే వినియోగదారులకు ఛార్జీ విధించబడుతుంది.
ATM transactions : కొత్త చార్జీలు ఇలా..
మార్చి 28, 2025 నాటి RBI నోటిఫికేషన్ లో ఇలా పేర్కొని ఉంది. “ATM ఇంటర్‌చేంజ్ ఫీజు ATM నెట్‌వర్క్ నిర్ణయించిన విధంగా ఉంటుంది. ఉచిత లావాదేవ...